Lockdown 2nd day: రోడ్లపైకి భారీగా వస్తున్న జనం
జనం| కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పది రోజులపాటు లాక్డౌన్ విధించింది. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుంది.

హైదరాబాద్: కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పది రోజులపాటు లాక్డౌన్ విధించింది. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపునిచ్చింది. దీంతో వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు భారీగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతో ఉదయం 6 గంటల నుంచే నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో వాహనాల రద్దీ నెలకొన్నది. నగరంలోని పలు మార్కెట్లు, దుకాణాల వద్ద జనం బారులు తీరారు. రాంనగర్ చేపల మార్కెట్లో రద్దీ ఎక్కువగా ఉన్నది. ఉదయం 10 గంటలకు ప్రజా రవాణా సహా అన్ని బంద్కానున్నాయి.
లాక్డౌన్ నేపథ్యంలో బ్యాంకులు, పోస్టాఫీసుల పనివేళల్లో మార్పులు చేశారు. నేటి నుంచి బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పనిచేయానున్నాయి. అదేవిధంగా పోస్టాఫీసుల్లో వినియోగదారుల సేవల సమయాలను తపాలా శాఖ కుదించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్ద పోస్టాఫీసుల్లో కౌంటర్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, చిన్న పోస్టాఫీసుల్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేయనున్నాయి. డెలివరీ సహా ఇతర సేవలు గతంలో మాదిరిగానే కొనసాగుతాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య తగ్గని ఉద్రిక్తతలు.. దాడుల్లో 72 మంది మృతి
సూపర్ స్ప్రెడర్లుగా ‘నిర్లక్ష్యపు’ యువత
లాక్డౌన్: పోస్టాఫీస్ పని వేళల్లో మార్పులు
భారత్లో వైరస్ వ్యాప్తికి మతపరమైన, రాజకీయ సమావేశాలే కారణం: డబ్ల్యూహెచ్ఓ
జూలై దాకా భారీగానే కేసులు
Black Fungus : కరోనా రోగులను భయపెట్టిస్తున్న బ్లాక్ ఫంగస్ .. ఇది ఎలా వస్తుంది? చికిత్స ఎలా?
కరోనా వచ్చేదే కాదు
తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
దయచేసి మాస్కు ధరించండి.. చనిపోయే ముందు ఓ వైద్యురాలి ఆవేదన
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

