తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం | తూర్పుగోదావరి జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సామర్లకోట వద్ద లారీ కారును ఢీకొట్టింది.

అమరావతి : తూర్పుగోదావరి జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దాపురం ఏడీబీ రహదారి పారిశ్రామిక ప్రాంతం వద్ద లారీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదు నెలల చిన్నారి సహా నలుగురు దుర్మరణం చెందారు. కారులో ఉన్న వ్యక్తులు తాళ్లరేవు మండలం పెద్దవలస నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న మరో ఐదుగురిని పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అయితే, మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి..
దయచేసి మాస్కు ధరించండి.. చనిపోయే ముందు ఓ వైద్యురాలి ఆవేదన
సెల్ ఫోన్ కోసం.. 40 కిలోమీటర్ల సైకిల్ సవారీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

