లాక్డౌన్: పోస్టాఫీస్ పని వేళల్లో మార్పులు
పోస్టాఫీస్| రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో పోస్టాఫీసుల్లో వినియోగదారుల సేవల సమయాలను తపాలా శాఖ కుదించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్ద పోస్టాఫీసుల్లో కౌంటర్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో పోస్టాఫీసుల్లో వినియోగదారుల సేవల సమయాలను తపాలా శాఖ కుదించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్ద పోస్టాఫీసుల్లో కౌంటర్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, చిన్న పోస్టాఫీసుల్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు. డెలివరీ సహా ఇతర సేవలు గతంలో మాదిరిగానే కొనసాగుతాయని స్పష్టం చేశారు.
12 గంటల వరకే బ్యాంకులు
లాక్డౌన్ దృష్ట్యా బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేశారు. గురువారం నుంచి బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకూ పనిచేస్తాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సూచనల మేరకు కుదించిన పనివేళల్లో నగదు డిపాజిట్, విత్‌డ్రాయిల్, చెక్కుల క్లియరెన్స్, రెమిటెన్సులు, ప్రభుత్వ కార్యకలాపాలు మాత్రమే నిర్వహించనున్నట్లు స్టేట్‌లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) కన్వీనర్ క్రిషన్ శర్మ చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటలవరకే ప్రజలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు వున్నందున, రోజంతా తెరిచినప్పటికీ ఉపయోగం లేదన్న కారణంగా బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి రామకృష్ణ తెలిపారు.
రాష్ట్రంలో కరోనా ఉధృతి నిలువరించడానికి ప్రభుత్వం నిన్నటి నుంచి లాక్డౌన్ అమలుచేస్తున్నది. దీంతో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సాధారణ కార్యకలాపాలు కొనసాగించుకోవడానికి ప్రజలకు అవకాశం కల్పించారు. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుంది. కేవలం అత్యవసర వస్తువులకు సంబంధించిన దుకాణాలు, హాస్పిట్లు, వ్యవసాయ సంబంధిత దుకాణాలు మాత్రమే తెరచి ఉంటాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా?
సూపర్ స్ప్రెడర్లుగా ‘నిర్లక్ష్యపు’ యువత
డీఆర్డీవో ‘ఆక్సీకేర్’లు వస్తున్నాయ్
జూలై దాకా భారీగానే కేసులు
Black Fungus : కరోనా రోగులను భయపెట్టిస్తున్న బ్లాక్ ఫంగస్ .. ఇది ఎలా వస్తుంది? చికిత్స ఎలా?
కరోనా వచ్చేదే కాదు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

