15 నాటికి ఖాతాల్లోకి పీఎఫ్ వడ్డీ.. కేంద్ర మంత్రి ప్రకటన
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) వ్యవస్థ కేంద్రీకృతమైన తర్వాత మొదటిసారిగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.25 శాతం వార్షిక వడ్డీని జూలై 15 నాటికి సుమారు 34 కోట్ల మంది సభ్యుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం ప్రకటించారు.
న్యూఢిల్లీ, జూలై 8 : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) వ్యవస్థ కేంద్రీకృతమైన తర్వాత మొదటిసారిగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.25 శాతం వార్షిక వడ్డీని జూలై 15 నాటికి సుమారు 34 కోట్ల మంది సభ్యుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం ప్రకటించారు. దీనికి అంచనాగా రూ. 1.44 లక్షల కోట్లు అవసరమవుతాయని ఆయన చెప్పారు. గతంలో ఈపీఎఫ్‌వో వడ్డీ రేటును చాలా ముందుగానే ప్రకటించినప్పటికీ సభ్యుల ఖాతాల్లో ఆ వడ్డీ వాస్తవంగా జమ కావడానికి అక్టోబర్-నవంబర్ వరకు సమయం పట్టేదని ఆయన పేర్కొన్నారు.
సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్(సీఐటీఈఎస్) ప్రాజెక్ట్ కింద తన మొత్తం డాటా బేస్‌ను ఒక కేంద్రీకృత ప్లాట్‌ఫామ్‌కు తరలించడాన్ని ఈపీఎఫ్‌వో పూర్తి చేసిందని మాండవీయ తెలిపారు. ప్రతి ఫీల్డ్ ఆఫీస్ వేర్వేరు డాటాబేస్‌లను నిర్వహించే మునుపటి కేంద్రీకృత విధానం స్థానంలో సీఐటీఈఎస్ ప్రాజెక్ట్ ఆటోమేషన్, నియమ-ఆధారిత ప్రాసెసింగ్ ద్వారా ఈపీఎఫ్‌వోకు చెందిన సేవా పంపిణీని ఆధునీకరిస్తుందని ఆయన అన్నారు. సీఐటీఈఎస్ అమలుతో ఈపీఎఫ్‌వో ఇప్పుడు ఒకే జాతీయ డాటాబేస్ ఆధారంగా పనిచేస్తున్నదని, దీనివల్ల సేవా అభ్యర్థనలను ఒక నిర్దిష్ట ప్రాంతీయ కార్యాలయానికి పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఏ అధికారిక కేంద్రం నుండైనా పరిష్కరించే వీలు కలుగుతున్నదని మంత్రి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

