Viral News | డ్యాన్స్ చేస్తానని అడిగిన వధువుపై వరుడు సీరియస్.. ఆగిపోయిన పెళ్లి!
Viral News | కాసేపట్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ జంట.. చిన్న వివాదం కారణంగా విడిపోయింది. ఊరేగింపులో డ్యాన్స్ చేయడానికి సిద్ధపడిన పెళ్లి కూతురిని పెళ్లి కొడుకు అడ్డుకుని మందలించాడు. వరుడి తీరు నచ్చకపోవడంతో వధువు తండ్రి అక్కడికక్కడే పెళ్లిని రద్దు చేసి.. తన కూతుర్ని తీసుకొని వెళ్లిపోయాడు.
Viral News | కాసేపట్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ జంట.. చిన్న వివాదం కారణంగా విడిపోయింది. ఊరేగింపులో డ్యాన్స్ చేయడానికి సిద్ధపడిన పెళ్లి కూతురిని పెళ్లి కొడుకు అడ్డుకుని మందలించాడు. వరుడి తీరు నచ్చకపోవడంతో వధువు తండ్రి అక్కడికక్కడే పెళ్లిని రద్దు చేసి.. తన కూతుర్ని తీసుకొని వెళ్లిపోయాడు. ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్గా మారింది.
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం చిన్నగానిపల్లి గ్రామానికి చెందిన యువకుడికి, కంభం మండలం తురిమెళ్లకు చెందిన యువతితో ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం ఉదయం ముహూర్తం ఉండటంతో.. శనివారం రాత్రి వధువుతో పాటు ఆమె కుటుంబసభ్యులు చిన్నగానిపల్లికి వెళ్లారు. కొంతసేటి తర్వాత వధూవరులను వాహనం ఎక్కించి బంధువులు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు కుటుంబాల బంధువులు, స్నేహితులు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ వధూవరులను సైతం డ్యాన్స్ చేయాలని కోరారు. దీంతో డ్యాన్స్ చేసేందుకు వధువు సిద్ధమైంది. అబ్బాయి మాత్రం తాను డ్యాన్స్ చేసేది లేదని స్పష్టం చేశాడు. అంతేకాకుండా నువ్వు కూడా డ్యాన్స్ చేయడానికి వీల్లేదంటూ వధువును మందలించాడు.
అందరి ముందే తన కూతురిని కోప్పడటం వధువు తండ్రికి ఏ మాత్రం నచ్చలేదు. పెళ్లికి ముందే ఇలా ఉంటే.. పెళ్లి తర్వాత పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో అని ఆలోచనలో పడిపోయాడు. వెంటనే కుమార్తెను వాహనంపై నుంచి దించేసి.. పెళ్లీ వద్దు గిల్లీ వద్దూ అంటూ కూతుర్ని తీసుకుని సొంతూరికి వెళ్లిపోయారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల మధ్య పెద్దలు చర్చలు జరిపినప్పటికీ విబేధాలు తొలగిపోలేదు. దీంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- Dance
- markapuram
- Marriage
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

