బెంగళూరు: రద్దీ రోడ్డులో ఒక నాగుపాము కనిపించింది. రోడ్డు మధ్యలో ఉన్న అది చాలాసేపు అక్కడే ఉన్నది. ఆ పాము ఎంతకీ అక్కడి నుంచి కదలకపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. చివరకు పోలీసులు ఆ నాగుపామును సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. (Cobra on Bangalore Road) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. మంగళవారం సాయంత్రం బెంగళూరులోని ప్యాలెస్ రోడ్డు మీదకు ఒక నాగుపాము వచ్చింది. పడగ విప్పిన అది రోడ్డు మధ్యలో ఉన్నది. సుమారు 40 నిమిషాల వరకు ఆ పాము కదకుండా అక్కడే ఉన్నది. ఈ నేపథ్యంలో వాహనాలు ఆగిపోవడంతో అక్కడ ట్రాఫిక్ స్తంభించింది.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఎంతకీ కదలక రోడ్డు మధ్యలో తిష్ట వేసిన ఆ నాగుపామును చివరకు సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. పాము కారణంగా స్తంభించిన ట్రాఫిక్‌ను చక్కదిద్దారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బెంగళూరు వాసులు, నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు. బెంగళూరు ట్రాఫిక్‌కు ఊహించని కొత్త వీఐపీ తారసపడినట్లు ఒకరు పేర్కొన్నారు. సాయంత్రం ధ్యానం కోసం బెంగళూరు రోడ్డు సరైనదని ఆ పాము భావించిందని మరొకరు చమత్కరించారు. ‘ఒక నాగుపాము కూడా ట్రాఫిక్ జామ్ సృష్టించగలదు. అది బెంగళూరులో మాత్రమే’ అని ఒకరు కామెంట్ చేశారు.
Bengaluru traffic met its newest VIP yesterday
A Cobra on Palace Road.
Seems like the snake decided the middle of the road was the perfect spot for a 30-minute evening meditation session, complete with hood fully open and zero concern for traffic rules.
Police finally… pic.twitter.com/4EgatP2Lnz
— Nagarjun Dwarakanath (@nagarjund) July 8, 2026