ముంబై : ముంబై ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం తప్పింది. రెండు ఎయిర్ ఇండియా విమానాలు ఒకే సమయంలో రన్‌వేపై ఎదురెదురుగా వెళ్లాయి. దీంతో టేకాఫ్ విమానం వెనక్కు వచ్చింది. మంగళవారం 9.40 గంటలకు ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ కోసం రన్‌వే పైకి వెళ్లింది.
అదే టైమ్‌లో బాగ్దోగ్రా నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ల్యాండింగ్ అయింది. రెండు విమానాలు ఒకే టైమ్‌లో రన్‌వే మీదకు రావడంతో ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ టేకాఫ్ విమాన సిబ్బందిని అలర్ట్ చేసింది. ఏటీసీ ఆదేశాలతో ఢిల్లీ వెళ్తున్న ఫ్లైట్ ను సిబ్బంది వెంటనే ఆపేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.