న్యూఢిల్లీ: కేంద్రవిద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే తాము ప్రధాని మోదీ రాజీనామాను డిమాండ్ చేస్తామని సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అన్నారు. ప్రధాన్ రాజీనామా చేయడం కుదరదని ప్రభుత్వ వర్గాలు తెలిపిన నేపథ్యంలో అభిజీత్ స్పందించారు. మూడు ప్రధాన డిమాండ్లపై ఎలాంటి అధికారిక హామీ తమకు రాలేదన్నారు. ప్రధాన్ రాజీనామాకు మించిన పరిహారం లేదన్నారు. సోనమ్ వాంగ్చుక్ దీక్షను విరమించడం సంతోషంగా ఉందని.. సీజేపీ స్వయంగా కోరినందువల్లే ఆయన విరమించారని దీప్కే వెల్లడించారు. తాము మాత్రం ప్రధాన్ రాజీనామా చేసేదాకా నిరసనలు కొనసాగిస్తామన్నారు. దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని ఈ విషయంలో మద్దతుదారులకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు అభిజీత్ చెప్పారు.