Watch: ఇద్దరు మహిళలపైకి దూసుకెళ్లిన వాహనం.. తర్వాత ఏం జరిగిందంటే?
Vehicle runs over two women | రోడ్డుపై నడుస్తున్న ఇద్దరు మహిళలపైకి ఒక వాహనం దూసుకెళ్లింది. దీంతో వారిద్దరూ గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. డ్రైవర్ వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అహ్మదాబాద్: రోడ్డుపై నడుస్తున్న ఇద్దరు మహిళలపైకి ఒక వాహనం దూసుకెళ్లింది. దీంతో వారిద్దరూ గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. డ్రైవర్ వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. (Vehicle runs over two women) సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్లోని మహిసాగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉస్మానీ నగర్ సొసైటీ ప్రాంతంలో ఇద్దరు మహిళలు రోడ్డుపై నడిచి వెళ్తున్నారు. వేగంగా దూసుకొచ్చిన వాహనం వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మహిళలు గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఒక మహిళ తీవ్రంగా, మరో మహిళ స్వల్పంగా గాయపడింది. గమనించిన స్థానికులు గాయపడిన ఇద్దరు మహిళలను ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు మహిళలను ఢీకొట్టిన తర్వాత డ్రైవర్ ఆ వాహనాన్ని వదిలేసి పారిపోయాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన డ్రైవర్ను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
महिसागर, गुजरात
महिसागर जिले के लुनावाडा कस्बे की उस्मानिया नगर सोसाइटी, एक तेज रफ्तार कार ने कथित रूप से नियंत्रण खो दिया और सड़क पर पैदल चल रही दो महिलाओं को पीछे से जोरदार टक्कर मार दी। टक्कर इतनी भीषण थी कि दोनों महिलाएं सड़क पर घिसट गईं और गंभीर रूप से घायल हो गईं। pic.twitter.com/fLW1rgprVd— Accident Prevention & Research Organization (@apron_india) July 6, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CCTV
- Gujarat
- hit and run
- runs over
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

