ఒట్టావా : కెనడా మాజీ ప్రధాని ట్రూడో ఇండియాపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుతో భారత అధికారులకు సంబంధం ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాల్లేవని కెనడా డిప్యూటీ కమిషనర్ లిసా మోరెలాండ్ స్పష్టం చేశారు.
ట్రూడో చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని సహచరుడు సతిందర్ జిత్ సింగ్‌పై అమెరికాలో కేసు నమోదైన కొన్ని గంటలకే కెనడా ఈ ప్రకటన చేసింది. బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వార దగ్గర్లో నిజ్జర్ హత్యకు గురయ్యాడు. ఆ టైమ్‌లో అప్పటి కెనడా ప్రధానిగా ఉన్న ట్రూడో.. ఈ హత్య వెనుక భారత్ ఉందని ఆరోపించారు.