కామారెడ్డి : కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్ఐ(Lingampeta SI) అరుణ్, రైటర్ రామస్వామి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని(ACB) ఆశ్రయించినట్లు తెలిసింది. వారి సూచనలు మేరకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, నాలుగు రోజుల క్రితమే నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్ఐ ఏసీబీకి చిక్కగా..వారం తిరగకముందే మరో ఎస్ఐ ఏసీబీకి పట్టుబడటం జిల్లాలో చర్చనీయాంశమైంది. మరోవైపు జిల్లాలో ఏసీబీ వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట