Kodangal | హైదరాబాద్ : కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కొంటున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులు, వారి కుటుంబాలపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. తమ భూములను లాక్కొవద్దు అని నిరసన తెలుపుతున్న రైతులను, వారి పిల్లలను అరెస్టు చేసి జైళ్లకు పంపిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో లగచర్ల బాధితురాలి మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశం సందర్భంగా ఓ బాధితురాలు బోరున విలపించారు. మా భర్తతో పాటు మా పిల్లలను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. ఇప్పుడు ఏ జైల్లో పెట్టారో కూడా తెలియడం లేదు. మా పెద్ద కొడుక్కి ఉరి శిక్ష వేస్తామని చెప్తున్నారు సార్ అంటూ కేటీఆర్ వద్ద ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
అధైర్య పడొద్దు.. మీ పిల్లలు, భర్తలను ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మాది అని కేటీఆర్ వారికి భరోసానిచ్చారు. కేసీఆర్ తరపున మాట ఇస్తున్నాం. మీ మనువండ్లు, పిల్లలు, భర్తలు ఇంటికి తిరిగి వచ్చే దాకా మేం చూసుకుంటాం. అండగా నిలబడుతాం. ఆందోళన చెందకండి.. కోర్టుకు పోయి కొట్లాడుతామని కేటీఆర్ ధైర్యమిచ్చారు.
మా పెద్ద కొడుక్కి ఉరి శిక్ష వేస్తామని చెప్తున్నారు సార్ అంటూ కేటీఆర్ వద్ద కన్నీరు పెట్టుకున్న లగచర్ల గ్రామస్థురాలు. pic.twitter.com/VxxLDVja5b
— BRS Party (@BRSparty) November 14, 2024
ఇవి కూడా చదవండి..
KTR | లగచర్ల ప్రజల తరపున న్యాయ పోరాటం చేస్తాం : కేటీఆర్
KTR | తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిసిన ఆరో తరగతి బాలిక
Pawan Kalyan | వైసీపీ పాలనపై అసెంబ్లీలో పవన్‌కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు