మహబూబ్‌నగర్ : కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని బీఆర్ఎస్ సోషల్ మీడియా(Social media) విభాగం కన్వీనర్ వరదా భాస్కర్ ముదిరాజ్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వన్ టౌన్ సీఐ చితకబాదారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) భాస్కర్‌కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజల తరఫున నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు.
అంతకు ముందు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఆంజనేయ గౌడ్ పల్లె రవికుమార్ తదితరులు పోలీస్ స్టేషన్లో బైఠాయించి నిరసన తెలిపారు. సీఐ క్షమాపణ చెప్పడంతో నిరసన విరమించారు. అనంతరం జైల్లో ఉన్న బీఆర్ఎస్ నేత శ్రీకాంత్ గౌడ్‌ను కలిసి పరామర్శించారు.
వరదా భాస్కర్ ముదిరాజ్‌కు ఫోన్ చేసి పరామర్శించి ఎన్ని కేసులు కేసులు పెట్టినా అండగా ఉంటామని హామీ ఇచ్చిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ https://t.co/ycE5xeicYL pic.twitter.com/YaU117Yq60
— Telugu Scribe (@TeluguScribe) October 30, 2024