KTR | హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ప్రజలంతా ఆర్ఎస్ బ్రదర్స్ అని అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బండి సంజయ్ రక్షణ కవచంలో రేవంత్ రెడ్డి ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్ రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. బండి సంజయ్‌కు చేతనైతే ఆర్ఆర్ టాక్స్‌పై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అమృత్ స్కాం నుంచి మొదలుకొని అనేక స్కామ్స్ పైన కేంద్రానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు కాపాడుతుంది? రేవంత్ రెడ్డి బిజెపిలో చేరుతానని ఏమైనా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారా అన్న విషయాన్ని స్పష్టం చేయాలి. కేంద్ర ప్రభుత్వం నిధులైన అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి బావమరిది స్కాం చేసినా కేంద్రం ఎందుకు కాపాడుతుంది? రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ దాడి చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
సుంకిశాల ప్రమాదంలో కూడా రేవంత్ రెడ్డి ఎవరిని కాపాడుతున్నాడో తెలుసు? సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదంపైన సమాచార హక్కు అడిగితే దేశ భద్రత అని రేవంత్ రెడ్డి కాంటాక్టర్‌ను కాపాడుతున్నారు. కృష్ణాజలాలపైన కేవలం ఉత్తరం రాసి చేతులు దులుపుకున్నారు. కృష్ణాజలాల్లో న్యాయమైన వాటా కోసం కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి ఉద్యోగం పోతదని రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. కృష్ణా జలాల దోపిడీపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎండగడుతాం. గతంలో కూడా నల్లగొండలో కేసీఆర్ ధర్నా చేసిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అని కేటీఆర్ గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ పాలనపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
KTR | సిగ్గు లేని సీఎం రేవంత్‌ను భట్టి విక్రమార్క ఉతికి ఆరేశారు : కేటీఆర్
KTR | రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్.. కేటీఆర్ తీవ్ర విమర్శలు