KTR | హైదరాబాద్ : రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ను తిట్టుడు, బూతులు మాట్లాడటం, తెలంగాణను శాపం పెట్టుడు బంద్ చేయ్ అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారూ.. అడ్డిమారి గుడ్డిదెబ్బలో సీఎం అయినవ్. ఇప్పటికైనా ఈ సొల్లు బంద్ చేయ్. తెల్లారలేస్తే కేసీఆర్ను తిట్టుడు, రంకెలేసుడు, బూతులు మాట్లాడుడు, దివాళాకోరు మాటలు మాట్లాడుడు, తెలంగాణను శపించుడు, తెలంగాణను తెల్లారలేస్తే దూషించుడు బంద్ చేయ్ అని చెబుతున్నాం. తెలంగాణను ఎవరు తిట్టినా దూషించినా, కించపరిచినా ఇదే పద్ధతిలో జవాబిస్తాం. ఎందుకంటే నీవు సిగ్గలేనోడివి, మూర్ఖుడివి కాబట్టి తెలంగాణను ఒక క్యాన్సర్ రోగితో పోల్చావు. తెలంగాణ ఒక వ్యాధిగ్రస్తమైన రాష్ట్రమని మాట్లాడినవ్. అందుకే నీవు మూర్ఖుడివి. నీ డిప్యూటీ సీఎం విడుదల చేసిన నివేదికను చుదువుకోని బుద్ధి తెచ్చుకో. సిగ్గు తెచ్చుకో అని చెబుతున్నాం అని కేటీఆర్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | అచ్చోసిన ఆంబోతులా వాగడం రేవంత్ రెడ్డికి అలవాటు : కేటీఆర్
KTR | ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదే : కేటీఆర్