KTR | హైదరాబాద్ : దేశ ప్రధాని నరేంద్ర మోదీ తలకిందులుగా తపస్సు చేసినా.. రాహుల్ గాంధీ మరో వంద జోడోయాత్రలు చేసినా.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో గత పదేండ్లలో జరిగిన అభివృద్దిని సాధించలేరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. గత పదేళ్లు కేసీఆర్ మొక్కవోని పట్టుదలతో తెలంగాణలో అభివృద్ధి యజ్ఞం చేశారు.. అని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికనే చెప్తున్నది అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ నాయకత్వంలో సొంత ఆదాయ వనరులతో కేంద్రం మీద ఆధారపడకుండా, ఇతరుమల ముందు చేయి చాపకుండా తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నంబర్ వన్‌గా నిలబడిందని ఆర్బీఐ నివేదిక తెలిపింది. 84 శాతంతో ఎస్ఓటీఆర్లో ముందు ఉన్నాం అని కేటీఆర్ తెలిపారు.
కాళేశ్వరం అంటేనే కమిషన్ల ప్రాజెక్టు అని ఎన్నికలకు ముందు కొందరు చిల్లర వాగుడు వాగారు. వారికి కూడా ఇదే నివేదిక(తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్) సమాధానం చెప్పింది. నివేదికలో ఏం చెప్పారంటే.. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, రైతుబంధు, 24 గంటల కరెంట్ వల్ల సంపద పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. వ్యవసాయానికి సంబంధించి కాళేశ్వరం, మిషన్ కాకతీయ ద్వారా వ్యవసాయ విస్తీర్ణం పెరిగిందని పేర్కొన్నారు. 2014లో 34 లక్షల ఎకరాల్లో వరి పంటలు పండేవి.. 68 లక్షల టన్నుల వరి ఉత్పత్తి అయ్యేది. మేం దిగిపోయే నాడు ఒక కోటి 18 లక్షల ఎకరాల్లో సాగు అయింది. 2 కోట్ల 60 లక్షల టన్నులు ఉత్పత్తి జరిగింది అని కేటీఆర్ తెలిపారు.
ఐటీ ఎగుమతుల్లో 2014లో 57 వేల కోట్లు ఉంటే 2023లో 2 లక్షల 41 వేల కోట్లు. నాడు ఐటీ ఉద్యోగుల సంఖ్య 3 లక్షల 23 వేలు.. మేం దిగిపోయేనాడు 10 లక్షల ఉద్యోగాలు. ఇలా వ్యవసాయం, ఐటీ పెరిగింది. యాదవ కురమ సోదరులకు గొర్రెలు పంపిణీ చేసి బలోపేతం చేసే ప్రయత్నం చేస్తే మీరు చిల్లరగా మాట్లాడారు. కానీ జీవ సంపదలో నంబర్ వన్‌లో ఉన్నారని మీ నివేదికలో పేర్కొన్నారని కేటీఆర్ గుర్తు చేశారు.
విద్యుత్ స్థాపిత సామర్థ్యం పెరిగిందని కూడా నివేదికలో పేర్కొన్నారు. ఆనాడు 1356 యూనిట్లు ఉంటే.. నేడు 2349 యూనిట్లు పెరిగింది. ఇవన్నీ కూడా మీ నివేదికనే చెబుతుంది. పారిశ్రామిక విస్తరణ కూడా పెరిగిందని చెప్పారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ వల్ల లాభం జరిగిందని చెబుతుంది మీ నివేదిక.. మీరు తప్పక చదవండి. మోదీ తలకిందులు తప్పసు చేసినా.. రాహుల్ గాంధీ మరో వంద జోడో యాత్రలు చేసినా ఈ అభివృద్ధి సాధించలేరు అనేది వాస్తవం. తెలంగాణలో గత పదేండ్లలో కేసీఆర్ అకుంఠిత దీక్షతో, మొక్కవోని పట్టుదలతో ఒక అభివృద్ధి యజ్ఞం చేశారు.. ఇది వాస్తవమని మీ నివేదికనే చెబుతుంది. 2014-15లో 5 లక్షల కోట్లు ఉన్న సంపద ఇవాళ 15 లక్షల కోట్లు అయిందని నివేదిక చెబుతుంది ఇది వాస్తవం. ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధించిందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | అచ్చోసిన ఆంబోతులా వాగడం రేవంత్ రెడ్డికి అలవాటు : కేటీఆర్
KTR | ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదే : కేటీఆర్