KTR : తమ అధినేత కేసీఆర్ ఉక్కు నరాలతో తయారైన నాయకుడు అని, ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనే చెక్కు చెదరని మనిషి అని భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు అన్నారు. 2028లో మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఏబీపీ సదరన్ రైజ్ సమ్మిట్ (ABP Southern Rise Summit) 2024 కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పదేండ్ల పాలనలో తెలంగాణను నంబర్ 1గా నిలిపామని ఆయన తెలిపారు.
దేశ చరిత్రలోనే ఎరగని విధంగా రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, ప్రభుత్వ ఉద్యోగులకు 73 శాతం జీతాలు పెంచామని ఆయన వెల్లడించారు. బీఆర్ ఎస్ తెలంగాణ ప్రజల పార్టీ అని కేటీఆర్ పునరుద్ఘాటించిన ఆయన తెలంగాణ ప్రజలకు బీఆర్ ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని తెలిపారు. రాజకీయ పార్టీలకు ప్రతి ఎన్నిక ఓ పరీక్ష అని, ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని కేటీఆర్ వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ 1.8 శాతం ఓట్ల తేడాతోనే గెలిచిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాల నుంచి ప్రజలను కాపాడుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నోరు మెదపని రాహుల్ గాంధీ తీరును కేటీఆర్ తప్పుబట్టారు. ఇక.. దేశ రాజకీయాల్లో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాన్ని ఆయన విమర్శించారు. తకు సహకరించని పార్టీలపై ఈడీని ప్రయోగిస్తుందని ఆయన బీజేపీని దుయ్యబట్టారు.