LCU – Lokesh Kanagaraj | తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మా నగరం సినిమాతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత కార్తీతో ఖైదీ అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అనంతరం మాస్టర్, విక్రమ్, లియో అంటూ బ్లాక్ బస్టర్లు సాధించిన విషయం తెలిసిందే. ఇందులో ఖైదీ తర్వాత విక్రమ్, లియో అని తనకంటూ లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేశాడు దర్శకుడు. ఇందులో ఖైదీ 2తో పాటు రోలెక్స్ ప్రాజెక్ట్లు ఫ్యూచర్లో రానున్నాయి. అయితే నేడు ఖైదీ సినిమా విడుదలై 5 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన ఎల్సీయూ (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) అసలు ఎలా పుట్టుకోచ్చింది అనే దానిపై సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు లోకేష్.
ఎల్సీయూ ఆరిజిన్స్ అంటూ 10 మినిట్స్ ప్రీలుడ్ వీడియోను విడుదల చేయనున్నట్లు లోకేష్ ప్రకటించాడు. ఇందులో అసలు ఖైదీ, విక్రమ్ సినిమాలకు కథ ఎలా పుట్టుకొచ్చింది. ఈ రెండు సినిమాలను ఎలా కనెక్ట్ చేశాం అనేది ఈ వీడియోలో లోకేష్ చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. ఈ లఘు చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు. లోకేష్ సోంత ప్రోడక్షన్ అయిన జీ స్క్వాడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
A teaching exercise that led to a ‘10 minute Prelude to the Origins of LCU’. #ChapterZeroFL unlock 💥@GSquadOffl X @cinemapayyan X @LevelUp_edu @anirudhofficial @anbariv @selvakumarskdop @philoedit @ArtSathees @PraveenRaja_Off @proyuvraaj pic.twitter.com/IXhVJB3bGn
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 25, 2024