BRS Party | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం పర్యటనలో ఉండగానే.. సొంత పార్టీకి చెందిన పలువురు నేతలు సీఎంకు షాకిచ్చారు. పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ మాజీ ఎంపీపీ, బీఎస్పీ కాంటెస్టెడ్ క్యాండిడేట్ నర్మదా, పలువురు కాంగ్రెస్ నాయకులు కారెక్కారు. వీరందరికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించే దిశగా పని చేస్తామని నేతలు పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని వారు ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
Telangana | బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనపై పోలీసు శాఖ సీరియస్.. శాఖాపరమైన చర్యలకు ఆదేశం!
కాంగ్రెస్ నేతలకు పోలీసులు బానిసలు కావద్దు.. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కీలక వ్యాఖ్యలు
Jeevan Reddy | నాకు చెప్పనేలేదు.. పార్టీ ఫిరాయింపులపై మరోసారి కాంగ్రెస్ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు