హైదరాబాద్ : ఖైరతాబాద్‌లో(Khairatabad) దారుణం చోటు చేసుకుంది. మార్నింగ్ వాక్కు వెళ్లిన న్యాయవాదిపై (Lawyer) ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. మొబైల్ లాక్కొని పారిపోయాడు. వివరాల్లో వెళ్తే.. న్యాయవాది కల్యాణ్ ఎప్పటిలాగే మార్నింగ్ వాక్ చేస్తుండగా అకస్మాత్తుగా గుర్తు తెలియని దుండగులు అతడిపై కత్తితో దాడి చేశారు. సెల్‌ఫోన్ లాక్కున్నారు. వారి నుంచి రక్షించుకునే క్రమంలో కల్యాణ్ చేతికి గాయమైంది. చికిత్స కోసం ఓ ప్రైవేట్ దవాఖానలో జాయిన్ అయ్యారు. కల్యాణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూడు బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా, దాడికి పాల్పడింది. సెల్‌ఫోన్స్ దొంగలించే ముఠా అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.