సిద్దిపేట : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొడకండ్ల వద్ద అధికారులు కాళేశ్వరం(Kaleshwaram project) నీళ్లు విడుదల చేశారు. దీంతో తుజాల్ పూర్ చెక్ డ్యాంకు నీళ్లు చేరాయి. కాగా, పంటలకు ఊపిరి పోసేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటిని గత కొద్ది సంవత్సరాలుగా కూడవెల్లి వాగులోకి(Koudavelli Vagu) వదులుతుండటంతో వేలాది ఎకరాల్లో పంటలకు సాగునీరు అందుతున్నది. కాళేశ్వరం నీటి విడుదలతో కూడవెల్లి వాగుపై నిర్మించిన 38 చెక్ డ్యాంలు జలకళను సంతరించుకోనున్నాయి.
వాగులో నీరు పుష్కలంగా ఉంటే భూగర్భ జలాలు ఉబికి వచ్చి బోరుబావుల్లో నీటి మట్టాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని స్థానిక రైతులు అంటున్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు చూపుతో చేసిన అభివృద్ధి పనులతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, వారు ఆర్థికంగా ఎదిగేందుకు మార్గం సుగమమైందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఆ మాజీ అధికారిని చూస్తే హృదయం కలిచివేస్తుంది : మాజీ మంత్రి హరీష్రావు
Fauji | ప్రభాస్ ఫౌజీ లాంగ్ షెడ్యూల్ ప్లాన్.. షూటింగ్ ప్లేస్ ఇదేనట..!
Thandel | తండేల్కు నాగచైతన్య, సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్స్.. ఎంతో తెలుసా..?