హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Government ) నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో మాజీ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) కలత చెందారు. ఓ రిటైర్డు పోలీస్ అధికారి పడుతున్న బాధను ట్విటర్లో (Twitter) కళ్లకు కట్టినట్లుగా వివరించారు.
30 ఏళ్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన రిటైర్డు పోలీస్ అధికారి ఠాగూర్ నారాయణ సింగ్‌కు రెండు కిడ్నీలు (Kidneys) చెడిపోయి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. మరోవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ అధికారి ఉండడం బాధాకరమని పేర్కొన్నారు .
ఈ పోలీస్ అధికారి ఆవేదన చూస్తే హృదయం కల్చివేస్తున్నది, 30 ఏళ్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన ఠాగూర్ నారాయణ సింగ్ గారు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం బాధాకరం.
ఒకవైపు రెండు కిడ్నీలు చెడిపోయి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మరోవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆర్థిక సమస్యలు… pic.twitter.com/CYXmAP9aAp
— Harish Rao Thanneeru (@BRSHarish) February 4, 2025
ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య భద్రత కార్డుతో చికిత్స చేసుకుందామని హాస్పిటల్ కి వెళ్తే చెల్లదంటూ పంపిస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం విశ్రాంత పోలీసు ఉద్యోగికి శాపంగా మారిందని అన్నారు. ఇది ఒక నారాయణ సింగ్ సమస్య కాదు. రాష్ట్రవ్యాప్తంగా రిటైర్డ్ అయిన 8వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల జీవన్మరణ సమస్యని పేర్కొన్నారు.
ఉద్యోగుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్న వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. వైద్యసేవలు పొందడంలో అంతరాయం కలగకుండా ఈహెచ్ఎస్, పోలీస్ ఆరోగ్య భద్రత కార్డులు ఆసుపత్రుల్లో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యసేవలు పొందడంలో అంతరాయం కలగకుండా ఈహెచ్ఎస్, పోలీస్ ఆరోగ్య భద్రత కార్డులు ఆసుపత్రుల్లో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, డీజీపీని కోరారు.