KA Paul | వరంగల్ : ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఢీకొట్టే సత్తా నాకు తప్ప ఎవరికీ లేదు అని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి రాజ్యాన్ని పడగొట్టి.. బీసీ రాజ్యాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్లో మీడియాతో కేఏ పాల్ మాట్లాడారు.
వరంగల్లో మీట్ ది ప్రెస్ పెట్టకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనను అడ్డుకున్నారని కేఏ పాల్ ఆరోపణలు చేశారు. సదాశివపేటను అభివృద్ధి చేసినట్టు వరంగల్ జిల్లాను అభివృద్ధి చేస్తానని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీని గెలిపించండి.. 100 రోజుల్లో ఉచిత విద్య, వైద్యం అందిస్తాను. సంవత్సరంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తానని పాల్ పేర్కొన్నారు.
కడియం శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. రేవంత్ రెడ్డి వసూలు చేసిన ట్యాక్స్ డబ్బులతో ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్టర్లు లేక అదానీకి కట్టపెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పులు పెరుగుతున్నాయి. ప్రజలు కష్టాల పాలవుతున్నారు అని పాల్ పేర్కొన్నారు.
రెడ్ల పార్టీలల్లోని బీసీలు బయటకు రండి.. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డిని ఢీకొడుదాం. చిత్తశుద్ధి ఉన్న ఏ ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదు. రాబోయే ఎన్నికల్లో తాను సీఎం అవుతానని కేఏ పాల్ ప్రకటించుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Himanshu Rao | తాత అడుగుజాడల్లో హిమాన్షు రావు.. వ్యవసాయ క్షేత్రంలో ఏం చేశాడో తెలుసా..?
Revanth Reddy | ఇక ఢిల్లీని ఉద్ధరిస్తడట.. అసెంబ్లీ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి గప్పాలు..!
BRS Party | ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు