పెద్దపల్లి : రూ. 20 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఇరిగేషన్ ఏఈ ఏసీబీకి(ACB) పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఓ బిల్లు విషయంలో కాంట్రాక్టర్‌ను నుంచి ఏఈ నర్సింగరావు లంచం డిమాండ్ చేశారు. దీంతో చేసేదిలేక సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రోడ్డుపైనే ఏఈకి కాంట్రాక్టర్ రూ.20 వేలు అందజేశారు. అక్కడే మాటు వేసిన ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. అలాగే నీటిపారుదల శాఖ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Devi Sri Prasad | ఎవరూ క్రెడిట్ ఇవ్వరు.. హాట్ టాపిక్‌గా పుష్ప నిర్మాతలపై డీఎస్పీ కామెంట్స్
Rashmika Mandanna | అతడెవరో అందరికీ తెలుసు.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిపోయిన రష్మికమందన్నా
Jr NTR | హిందీలో రెండో సినిమా.. ఆ అగ్రిమెంట్‌పై తారక్ సైన్ చేశాడా ఏంటీ..?
Vijay Antony | విలన్‌గా విజయ్ ఆంటోనీ మేనల్లుడి గ్రాండ్ ఎంట్రీ.. గగన మార్గన్ పోస్టర్లు వైరల్