ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 00:57:26

ఇందూరు ఎమ్మెల్సీ ఫలితం నేడే

ఇందూరు ఎమ్మెల్సీ ఫలితం నేడే

  • రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు  
  • గంటలోపే తేలనున్న ఫలితం

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో వెల్లడికానున్నది. ఈ స్థానానికి అక్టోబర్‌ 9న పోలింగ్‌ జరుగగా సోమవారం ఓట్లను లెక్కించనున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల నుంచి బ్యాలెట్‌ బాక్సులను అధికారులు పోలింగ్‌ ముగియగానే స్ట్రాంగ్‌రూంకు తరలించారు. నిజామాబాద్‌ నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లకు శిక్షణనిచ్చారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. 

కౌంటింగ్‌ కోసం అధికారులు 50 పోలింగ్‌ కేంద్రాలకు 6 టేబుళ్లు ఏర్పాటుచేశారు. రెండు రౌండ్లలోనే ఫలితాలను ప్రకటించనున్నారు. మొదటి రౌండ్‌లో 600 ఓట్లు, రెండోరౌండ్‌లో మిగిలిన 221 ఓట్లను లెక్కించనుండటంతో గంటలోపే ఫలితం తేలనున్నది. ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో మొత్తం 824 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో బోధన్‌కు చెందిన ఓ కౌన్సిలర్‌ మృతి చెందగా, మరో ఇద్దరు ఓటర్లు కరోనా కారణంగా పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 99.64% పోలింగ్‌ నమోదైంది. 


logo