KTR | మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్, నేను ప్రచారం చేసేదేమీ ఉండదని.. సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రచారం చేసినా కాంగ్రెస్ సాధించింది ఏమీ లేదని అన్నారు.
తెలంగాణలో మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం సర్పంచులను గెలిచామని.. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి. జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టే అలోచనలో ప్రభుత్వం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలేనన్నారు. మున్సిపల్ ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నామని.. శివరాత్రి లోపలే మున్సిపల్ ఎన్నికలు ముగిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.
జిల్లాలను ఎత్తేసే ప్రయత్నం..
బస్తీబాట కార్యక్రమంతో క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుంటున్నాం . పదేళ్లలో మేము చేసినవి.. కాంగ్రెస్ రెండేళ్లుగా చేయనివి గుర్తు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. సర్వేలు, అభ్యర్థి బలాలు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. ఎన్నికల్లో జనసేన సహా ఎవరైనా పోటీ చేయొచ్చు. క్షేత్రస్థాయిలో బలముంటే తప్ప.. స్థానిక ఎన్నికల్లో గెలవటం ఈజీ కాదు. జిల్లాలను ఎత్తేసే ప్రయత్నం జరుగుతుంది. జనగాం, నారాయణ పేట, వనపర్తి, సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల జిల్లాలను ఎత్తేస్తారనే ఆందోళన ఉంది .జిల్లాలు ఉండాలా.. పోవాలా..? అనేది మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే జిల్లాలు ఎత్తివేయటం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు.
స్థానిక సమస్యల ఆధారంగానే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేస్తారని.. ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆధారాలు చూపలేకపోయారు. ఫార్ములా ఈ కేసులో దోషులుగా చెప్తోన్న గ్రీన్ కోతో దావోస్‌లో రేవంత్ చర్చలు జరుపుతున్నారు . బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా..? రేవంత్ రెడ్డి చేస్తోన్న తుగ్గగ్ పనులతో జంట నగరాల అస్థిత్వం దెబ్బ తింటుంది . సినిమా టిక్కెట్లు పెంచేది లేదని యూ టర్న్ తీసుకున్నారు. మున్సిపాలిటీల వారీగా బీఆర్ఎస్ ఇంచార్జ్‌లు నియమిస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల కోసం ప్రతీ ఉమ్మడి జిల్లాకు ఇంచార్జ్ నియమించామని.. 8 ఉమ్మడి జిల్లాల సన్నాహక సమావేశాలు పూర్తి చేశామని పేర్కొన్నారు.
జిల్లాల అంశమే ప్రధాన అస్త్రంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం..
జిల్లాల తొలగిస్తారని ప్రచారం జరుగుతుంది. దీనితో చాలా చోట్ల ప్రజల్లో ఆందోళన ఉన్నదని కేటీఆర్ అన్నారు. కొత్త జిల్లాలు చేసిన పట్టణాల్లో జిల్లాలు ఎత్తేసారు అనే భావనలో ఉన్నారు. ప్రజలు అంతా కూడా ఆందోళనలో ఉన్నారు. జిల్లాల అంశాన్ని ప్రధాన అస్త్రంగా మున్సిపల్ ఎన్నికలలో ప్రచారం చేస్తామన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల కో ఆర్డినేటర్లను పెడుతున్నాం.స్థానిక నాయకులు ఎవరికి టికెట్ ఇవ్వాలని డిసైడ్ చేస్తారు.ఎన్నికలు లేని నాయకులు, ఎమ్మెల్యేలను మున్సిపల్ ఎన్నికల దగ్గర ఇంచార్జ్ లుగా నియమిస్తాం.లోకల్ ఎన్నికలు కాబట్టి లోకల్ వాళ్లే ప్రచారం చేస్తారు.స్థానికత ఆధారంగా ప్రచారం నిర్వహించనున్నట్టు కేటీఆర్ వెల్లడించారు.స్థానిక సమస్యలను ఎజెండాగా ముందుకు తీసుకొని ముందుకు వెళ్తాం.
ముఖ్యమంత్రి హార్వర్డ్ వెళ్లి మంచిగా తిరిగి వస్తారు అనుకుంటున్నా. పఠాన్ చెరువు ఎమ్మెల్యే కూడా మా బీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలి అంటున్నారు. మేము కూడా అదే అంటున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.పార్టీ మారిన తర్వాత ఆయా నియోజకవర్గాలలో వారికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాటం చేస్తున్నారు.సింగరేణిపై మంత్రులు మాట్లాడడం లేదు.సింగరేణిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.ఒక్క వైపు ఫార్ములా ఈ అంటాడు. అందులో ఫ్రూవ్ చెయ్యి.ఇక్కడ ఫార్ములా ఈపై విచారణ అంటాడు. అక్కడ దావోస్‌లో గ్రీన్ కోతో చర్చలు జరుపుతున్నారు.
ఒక్క దగ్గర మంచోళ్ళు అవుతారు. మరో దగ్గర చెడ్డోళ్లు అవుతారు ఎలా..? హైద్రాబాద్ కార్పొరేషన్ ఒక్కటే ఉండే మేమేం మార్చలేదు. రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి. రేవంత్ రెడ్డి తుగ్లక్, సమాధానం చెప్పే వరకు ఆయన వెంబడి పడుతాం.
రేవంత్‌లో రాము, రెమో ఉన్నారు…
రేవంత్‌లో రాము ఉన్నాడు.. రెమో ఉన్నాడని కేటీఆర్ అన్నారు. ఉదాహరణకు సినిమా టికెట్లు పెంచం అంటాడు , మరోవైపు సినిమా టికెట్లు పెంచుతూ జీవో ఇస్తారు. సర్వాయి పాపన్న పేరు మీద జనగామ జిల్లా చేస్తాం అన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ అదే జిల్లాను తొలగిస్తాం అన్నారు. అందుకే ఆయన రాము రెమో అని అన్నానని చెప్పుకొచ్చారు కేటీఆర్.
Ramagiri : ‘పీజీ పరీక్ష ఫీజు గడువును పొడిగించాలి’
Jharkhand: ఏనుగు బీభత్సం.. 22 మంది మృతి.. జార్ఖండ్‌లో ఎమర్జెన్సీ
Rachel McAdams | రాచెల్ మెక్‌ఆడమ్స్‌కు అరుదైన గౌరవం.. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో చోటు