హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ మరోసారి ఉక్కుపాదం మోపింది. లాఠీలు ఝుళిపించి, అక్రమ అరెస్టులతో వేధింపులకు దిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, నిరుద్యోగులను నిండా ముంచిందంటూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. సరిగ్గా 15 ఏండ్ల క్రితం ప్రత్యేక తెలంగాణ కోసం నిర్వహించిన ‘మిలియన్ మార్చ్’ స్ఫూర్తిగా పోలీసు నిరుద్యోగుల జేఏసీ దిల్సుఖ్నగర్ వేదికగా ఈ ర్యాలీని తలపెట్టింది. ఈ ర్యాలీని అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు హాస్టళ్లు, ఇన్స్టిట్యూట్లు, ని రుద్యోగుల అడ్డాలపై నిఘా పెట్టి కట్టడి చేశారు. దిల్సుఖ్నగర్, చిక్కడపల్లి, అశోక్‌నగర్, మలక్‌పేట ప్రాంతంలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లకు ముందస్తు హెచ్చరికలు జారీచేశారు. మిలియన్ మార్చ్ కోసం విద్యార్థులు దిల్సుఖ్నగర్ ప్రాంతానికి భారీగా తరలివస్తారనే సమాచారంతో నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పో లీసులను మోహరించారు. విద్యార్థి, యువజ న నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి మార్చ్ జరుగకుండా అడ్డుకున్నారు. సోమవా రం రాత్రి నుంచే అరెస్టులు మొదలుపెట్టింది. పోలీసుల నిర్బంధాన్ని నిరసిస్తూ నినదించిన వారి గొంతులు నొక్కుతూ ఎక్కడికక్కడ పోలీ సు వాహనాల్లోకి ఈడ్చిపడేశారు. నిర్బంధాలను అధిగమించి దిల్సుఖ్నగర్ వరకు వచ్చి న వారిని వెంటాడి, తరిమి అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ అబ్దుల్లాపూర్‌మెట్, చై తన్యపురి, సరూర్‌నగర్, మలక్‌పేట, నాగోల్, చిక్కడపల్లి, ఉస్మానియా, నాంపల్లి పోలీస్స్టేషన్లకు తరలించారు. ఒక్కో పోలీసు స్టేషన్లో 50మంది వరకు ఉంచారు. వివిధ జిల్లాల నుంచి బయలుదేరుతున్న నిరుద్యోగులను అ క్కడే అడ్డుకున్నారు. ఉట్నూరులో నిరుద్యోగులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
దిల్‌సుఖ్‌నగర్‌లో తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూక్యాకుమార్ సహా వందలాది మంది నిరుద్యోగులు దిల్సుఖ్నగర్ మెట్రోస్టేషన్ వద్ద ఆందోళనకు దిగా రు. అశోక్‌నగర్‌లో జేఏసీ నేతలు కొడంగల్ రవి కుమార్, శంకర్ నాయక్, రవి కుమార్, బాలకోటి, వెంకటేశ్ తదితరులను ముందస్తుగానే అరెస్టు చేశారు. నిరుద్యోగ భృతి, టీజీపీఎస్సీ ప్రక్షాళన వంటి ఎన్నో హామీలను మ్యానిఫెస్టోలో పెట్టి అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని నిరుద్యోగ జేఏసీ నాయకులు అశోక్ స్పష్టం చేశారు. నిరుద్యోగుల హక్కుల కోసం, ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం పోరాటం, ఉద్యమం ఆగదని తెలిపారు. ఎంత ముందుకైనా వెళ్తామని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. విద్యార్థిలోకం తలచుకుంటే కానిది ఏదీ లేదని, ప్రభుత్వాలే కూలిన సందర్భాలు ఉన్నాయనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
హైదరాబాద్‌లోని అశోక్‌నగర్, అమీర్‌పేట్, దిల్సుఖ్నగర్, ఎస్ఆర్నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నిరుద్యోగులు ఆందోళనకు రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. దిల్‌సుఖ్‌నగర్‌లో కోచింగ్ సెంటర్ల వద్దనే పోలీసులను కాపలా పెట్టారు. నిర్బంధాలను, అక్రమ అరెస్టులు, బెదిరింపులను ఛేదించుకొని.. నిరుద్యోగులు రోడ్లపై నిరసనలు తెలిపారు. తక్షణం 20వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులతో నినాదాలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ నోటిఫికేషన్‌పై ప్రకటన చేయకపోతే మరో ఉద్యమం చేపబుతామని హెచ్చరించారు.
గత ప్రభుత్వం రెండేండ్లకు ఒకసారి పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇ చ్చిందని, ప్రస్తుతం నోటిఫికేషన్ లేక నా లుగేండ్లు అవుతున్నదని, అధికార కాంగ్రెస్ నిరుద్యోగులను గాలికి వదిలేసిందని నిరుద్యోగ జేఏసీ విమర్శించింది. ఏడాది కి రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్న హామీ ఏమైందని నిలదీసింది. గత ప్రభుత్వం ఇచ్చిన పోలీసు ఉద్యోగాలను తమ ఖా తాలో వేసుకొని.. కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడింది. నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్‌రెడ్డికి కనిపించిన నిరుద్యోగుల సమస్యలు.. ఇప్పుడు అధికారంలో, ము ఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనిపించడం లేదా? అని నిలదీసింది. సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పాలని డి మాండ్ చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఇక తాడోపేడో తేల్చుకుంటామని జేఏసీ ప్రతినిధులు ఆకాశ్, శంకర్, వంశీ, నవీన్ పట్నాయక్, శింబునాయ క్, మో తీలాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.