Rachel McAdams | హాలీవుడ్ వెండితెరపై తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి రాచెల్ మెక్ఆడమ్స్ అరుదైన గౌరవం దక్కించుకుంది. సినీ రంగంలో ఆమె అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ప్రఖ్యాత ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్’(Hollywood Walk of Fame)లో 2,833వ నక్షత్రాన్ని(Star) ఆమెకు కేటాయించి ఘనంగా గౌరవించారు. లాస్ ఏంజిల్స్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో రాచెల్ మెక్ఆడమ్స్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని సందడి చేశారు. సాధారణంగా తన వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచే రాచెల్, ఈ వేడుకలో తన భాగస్వామి జేమీ లిండెన్, ఇద్దరు పిల్లలతో కలిసి బహిరంగంగా కనిపించడం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు సామ్ రైమి తోటి నటుడు డమ్నాల్ గ్లీసన్ ఆమెను అభినందిస్తూ ప్రసంగించారు.
హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడంపై రాచెల్ మెక్ఆడమ్స్ మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల వయసులో నటి కావాలన్న తన కలను నిజం చేయమని తండ్రికి రాసిన లేఖను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది. తనపై నమ్మకం ఉంచి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ఈ విజయాని అంకితం చేస్తూ తనకు స్ఫూర్తిగా నిలిచిన దివంగత నటీమణులు డయాని కీటన్, జెనా రోలాండ్స్ను రాచెల్ స్మరించుకుంది. ‘మీన్ గర్ల్స్’, ‘ద నోట్‌బుక్’, ‘స్పాట్లైట్’ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాచెల్ ప్రస్తుతం సామ్ రైమి దర్శకత్వంలో వస్తున్న ‘సెండ్ హెల్ప్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. ఈ చిత్రం జనవరి 30న విడుదల కాబోతుంది.
Rachel McAdams receives a star on the Hollywood Walk of Fame! ⭐️
See SEND HELP in theaters January 30. pic.twitter.com/DhtkTcbDw1
— 20th Century Studios (@20thcentury) January 20, 2026