Komatireddy Rajagopalreddy | కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య పదవుల పంచాయతీ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై, పార్టీ నాయకత్వంపై చేసిన ప్రతికూల వ్యాఖ్యలను సమయాన్ని బట్టి తమకు అనుకూలంగా మలచుకోవడం కనిపిస్తుంటుంది. మంత్రి పదవి విషయంలో అసంతృప్తిగా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటికప్పుడు రేవంత్ సర్కార్‌పై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ హాట్ టాపిక్‌గా నిలిచారు.
రేవంత్ రెడ్డికి, పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇద్దరికీ బుద్ధి లేదు.. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి బుద్ధి లేదు.. ఆయనను పార్టీలోకి తీసుకున్న రేవంత్ రెడ్డికి బుద్ధి లేదంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారని తెలిసిందే. అయితే కొండా సురేఖను బర్తరఫ్ చేసిన తర్వాత నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిని నేనెప్పుడూ దూషించలేదని.. ఒకటి, రెండు అంశాల్లో మాత్రమే విభేదించానని అన్నారు. రేవంత్ రెడ్డితో నాకు ఎలాంటి విభేదాలు లేవు. కొడంగల్, మధిర స్థాయిలో నా నియోజకవర్గానికి నిధులు వచ్చాయి. మునుగోడుకు రూ.2 వేల కోట్ల నిధులు వచ్చాయన్నారు. అంతేకాదు సీఎం సభకు వేలాది మంది కార్యకర్తలతో వెళ్తా.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అధిష్టానానిదే ఫైనల్ నిర్ణయం అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడీ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపాయి.
January 12 Vidudala | వెంకీ, కళ్యాణ్ రామ్ మూవీకి లీకుల బెడద.. సెట్ నుండి బయటకొచ్చిన సాంగ్ వీడియోలు!
KTR | కేటీఆర్‌కు అలుగునూరులో ఘనస్వాగతం.. పోటీపడి రాఖీలు కట్టిన మహిళలు
New World Map: కొత్త ప్రపంచ పటం .. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుకూలంగా ఇండియా ఓటు