PoK Protesters | భారత్‌లో కలపాలంటూ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆందోళనలు.. 110 రోజులకు చేరిన నిరసన
PoK Protesters : పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో కొంతకాలంగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తమను భారత్‌లో కలపాలంటూ పీవోకేలో స్థానిక ప్రజలు అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు.
PoK Protesters : పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో కొంతకాలంగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తమను భారత్‌లో కలపాలంటూ పీవోకేలో స్థానిక ప్రజలు అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. గత జూన్ 9న ప్రారంభమైన నిరసనలు శనివారం 110వ రోజుకు చేరాయి. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌ను ఇండియాలోని జమ్మూ కాశ్మీర్లో కలపాలని అక్కడి వారు డిమాండ్ చేస్తున్నారు. పీవోకేలోని మందోల్ గ్రామంలో శనివారం భారీ నిరసన ప్రదర్శన జరిగింది.
ఈ ఆందోళనల్లో 25,000 మంది పాల్గొన్నారు. ఈ ఆందోళనలు జరిగిన ప్రాంతం లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వోసీ)కి ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అంటే, ఇండియా సరిహద్దుకు ఏడు కిలోమీటర్ల దూరంలోనే. ఈ నిరసనపై అవామీ యాక్షన్ కమిటీ నేత సర్దార్ అమన్ ఖాన్ స్పందించారు. మూడు నెలలుగా పాక్ ప్రభుత్వం తమను వేధిస్తోందన్నారు. కనీసం ప్రభుత్వం రేషన్ కూడా సరఫరా చేయడం లేదని ఆరోపించారు. పీవోకేకు, జమ్మూ కాశ్మీర్‌కు మధ్యలో ఉన్న ఎల్వోసీని రద్దు చేయాలా అని అక్కడ ఆందోళన చేస్తున్నవారిని ఆయన ప్రశ్నించారు.
దీంతో ఆందోళనలో పాల్గొన్న వారంతా రద్దు చేయాలని నినదించారు. రెండు ప్రాంతాల మధ్య నియంత్రణ రేఖను తొలగించాలని, ఇండియాలో పీవోకేను కలపాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు ప్రాంతాల మధ్య రవాణా మార్గాన్ని తెరవాలని కూడా వారు కోరుతున్నారు. ఇందుకోసం మరింతగా ఉద్యమించేందుకు సిద్ధమని ప్రకటించారు. పాక్ ప్రభుత్వం తమతో ఏదైనా ఒప్పందం చేసుకోవాలని అనుకుంటే తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని సర్దార్ ఖాన్ సూచించారు. పాక్ ఆర్మీ ఈ ప్రాంతాన్ని తమ దేశ భూభాగంగా చెప్పుకొంటుంది.
అయితే, తమను బానిసల్లా చూస్తున్నారని ఖాన్ విమర్శించారు. తమను పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా దోచుకుంటూ, అణచివేతకు గురి చేస్తోందని ఆరోపించారు. పీవోకేలో జరుగుతున్న ఆందోళనల్ని పాక్ ప్రభుత్వం దారుణంగా అణచివేస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

