Asian Games : ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో ఎనిమిదో రోజు భారత బృందం అదరగొడుతోంది. స్క్వాష్‌లో అనాహత్ సింగ్ (Anahat Singh) సిల్వర్ మెడల్ సాధించిన కాసేపటికే మహిళల 200 మీటర్ల ఫైనల్లో హరిత భత్రా (Harita Bhatra) కంచు మోత మోగించింది. పతక పోరులో శక్తినంతా కూడదీసుకొని పరుగెత్తిన తను.. మూడో స్థానంలో నిలిచింది. జపాన్ అథ్లెట్‌ను వెనక్కి నెట్టి 23.20 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్న హరిత పోడియం మీద సగర్వంగా కాంస్యంను అందుకుంది. తద్వారా మహరాష్ట్రకు చెందిన హరిత యావత్ భారతావనని పులకింపజేసింది.
నగోయలో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఎనిమిదో రోజు నిర్వహించిన మహిళల 200 మీటర్ల పరుగులో హరిత భత్ర కాంస్యంతో మెరిసింది. ఆద్యంతం హోరాహోరీ సాగిన పరుగులో జపాన్‌కు చెందిన అబిగెరుఫుక ఇడోను 0.01 సెకన్లతో వెనక్కి నెట్టింది. చిరుతలా పరుగు తీసిన 23 ఏళ్ల హరిత 23.20 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచింది. దాంతో.. అథ్లెటిక్స్‌లో తన వంతుగా దేశానికి పతకం అందించిందీ మహారాష్ట్ర వనిత.
HARITA BHADRA HAS DONE IT
THE SPRINTER FROM MAHARASHTRA HAS WON BRONZE IN THE WOMEN’S 200M.
Watch her around the bend.#athleticsindia #asiangames2026 pic.twitter.com/LOFQwrSGAA— nnis Sports|Asian GamesAthletics (@nnis_sports) September 27, 2026
ఇదే పోటీల్లో భారత్‌కు చెందిన ఉన్నాతి అయ్యప్ప బొలాండ్ నిరాశపరిచింది. 23.46 సెకన్లలో పరుగు పూర్తి చేసిన ఆమె ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే.. హరిత మూడో స్థానంతో కాంస్యం గెలుపొందగానే.. ఆమె దగ్గరకు పరుగున వెళ్లి హగ్ ఇచ్చింది ఉన్నాతి.