Asian Games : నగోయ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అనాహత్ సింగ్ (Anahat Singh) చరిత్ర సృష్టించింది. మహిళల స్క్వాష్ (Squash) ఫైనల్లో వెండి పతకంతో మెరిసిందీ టీనేజర్. స్వర్ణం చేజారిన ఈ విభాగంలో భారత్‌కు పతకం అందించిన తొలి అమ్మాయిగా రికార్డు నెలకొల్పిందీ యంగ్‌స్టర్. ఆదివారం పసిడి పోరులో అనాహత్ వెనకబడింది. అయినా సరే దేశం గర్వించదగ్గ ప్రదర్శనతో ఆసియాడ్‌లో మొదటి మెడల్ పట్టేసిందీ 18 ఏళ్ల సంచలనం.
జపాన్‌లోని నగోయ ఆతిథ్యమిస్తున్న 18వ ఆసియా క్రీడల్లో భారత అమ్మాయి అనాహత్ సింగ్ వెండి వెలుగులు విరజిమ్మింది. మహిళల సింగిల్స్ స్క్వాష్‌లో సత్తా చాటుతూ ఫైనల్ చేరిన తను.. ఆఖరి మెట్టుపై తడబడి రన్నరప్‌గా నిలిచింది. ఆత్మవిశ్వాసంతో పసిడి వేటకు సిద్ధమైన భారత ప్లేయర్‌కు డిఫెండింగ్ ఛాంపియన్ సివసంగరి సుబ్రమణియమ్(మలేషియా) షాకిచ్చింది. వరల్డ్ నంబర్ 5 అయిన సివసంగరి దూకుడు కనబరిచి.. వరస సెట్లలో 3-0తో అనాహత్ను ఓడించింది. దాంతో.. దేశానికి స్వర్ణం అందించాలనుకున్న ఈ జూనియర్ వరల్డ్ ఛాంపియన్ సిల్వర్‌తో సరిపెట్టుకుంది.
A Historic Silver for Indian Squash!🥈🇮🇳
Congratulations to our young champion, Anahat Singh, on clinching the Silver Medal in Women’s Singles Squash at #AsianGames2026.#Cheer4Bharat pic.twitter.com/07cit6gobY
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 27, 2026