శనివారం 30 మే 2020
Telangana - May 06, 2020 , 13:03:11

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మేయర్‌ బొంతు రామ్మోహన్‌

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మేయర్‌ బొంతు రామ్మోహన్‌

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని వెంగళరావునగర్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు వెయ్యి మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. తలసేమియా బాధితులు, అత్యవసర పరిస్థితి ఉన్నవారికోసం రక్తం నిల్వచేసి ఉంచుతామని, పార్టీ తరపున వారికి అందిస్తామని మేయర్‌ చెప్పారు. మంత్రి కేటీఆర్‌ సూచనతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిత్యం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.


logo