Telangana Rains: బంగాళా ఖాతంలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడం.. ‘అస్నా’ తుఫాన్(Asna Cyclone) కారణంగా భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. ఇప్పటికే పలుచోట్ల కొందరు గల్లంతయ్యారు. వరద నీరు ఇండ్లలోకి రావడంతో పాటు పలు చోట్ల రోడ్డులు తెగిపోవడం వంటి సంఘటనలు భయపెడుతున్నాయి. దాంతో, రెండు రాష్ట్రాల్లోని పరిస్థితిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ఆరా తీశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడులకు ఆయన ఫోన్ చేశారు. తక్షణమే అవసరమైన సాయం అందిస్తామని ఆయన ఇద్దరు సీఎంలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి షాకు వివరించారు.
This video from #Telangana‘s #Khammam district suggests PrakashNagar area is flooded; person who has shot video says he has never seen anything like this even when #Godavari is in spate #TelanganaFloods #TelanganaRains pic.twitter.com/I0pzyKh8Dz
— Uma Sudhir (@umasudhir) September 1, 2024
ఎడతెరిపి లేని వాన కారణంగా తెలంగాణ, అంధ్రప్రదేశ్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణలో పలు జిల్లాలు జలమయం అయ్యాయి. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో కుండపోత దెబ్బకు రోడ్లు దెబ్బతిన్నాయి. పలుచోట్ల జనాలు నీళ్ల మధ్యలో చిక్కుకొన్నారు. ఇక మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 43.8 సెంటీ మీటర్ల వాన పడింది.
Real Heroes: Saluting the Brave Workers Who Serve Telangana Amidst Rains and Floods
In the face of relentless rains and rising floodwaters, the true spirit of service shines through in Telangana. Among those who stand as beacons of dedication are the employees of the Telangana… pic.twitter.com/c1Z4KglVhX
— Sudhakar Udumula (@sudhakarudumula) September 1, 2024
కేసముద్రం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు కింది రాళ్లు తొలగి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వరంగల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దాంతో, జన జీవనం స్తంభించి పోయింది. వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారాలతో మంత్రులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మరో రెండు రోజులపైనే వర్ష సూచన ఉండడంతో తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం సెప్టెంబర్ 2 సోమవారంను సెలవు దినంగా ప్రకటించిన విషయ తెలిసిందే.
Speedy restoration works in progress in the affected section due to incessant rains in Intakanne – Kesamudram Section, Secunderabad Division, Telangana. SCR Officials monitoring the restoration works camping at the affected site. pic.twitter.com/eok1XaHHgk
— South Central Railway (@SCRailwayIndia) September 1, 2024