సిద్దిపేట జిల్లాలో పులి సంచారంతో జనం బిక్కుబిక్కుంటున్నారు. సిద్దిపేట మండలం మిరుదొడ్డి, బుస్సాపూర్, తొగుట మండలం వరదరాజు పల్లి ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నటు అటవీ అధికారులు గుర్తించారు. పాద ముద్రల ఆధారంగా పులి సంచరాన్ని గమనించిన అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
పులి సంచరిస్తున్న విషయం తెలియగానే ఈ ఊళ్లకు పక్కనే ఉన్న గోవర్ధనగిరి, ముత్యంపేట్, మిరుదొడ్డి మండలం అందే, కొండాపూర్ గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొండాపూర్ గ్రామ ప్రజలకు సర్పంచ్ పులి సంచారంపైన అవగాహన కల్పించారు. రైతులు పొలాల కాడికి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని తమ జీవాలను సాయంకాలం తమవెంటే ఇంటికి తోలుక రావాలని ఆయన చెప్పారు.