Yograj Singh | నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాడు.. ధోనీని ఎప్పటికీ క్షమించను
Yograj Singh : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) కెప్టెన్సీలో ఎందరో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. అయితే.. ధోనీ సీనియర్లను పక్కన పెట్టేశాడనే అరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్(Yuvraj Singh) తండ్రి యోగ్రాజ్ సింగ్(Yograj Singh) మహీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు
Yograj Singh : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కెప్టెన్సీలో ఎందరో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. అయితే.. సారథిగా పగ్గాలు అందుకున్నాక ధోనీ.. సీనియర్లను పక్కన పెట్టేశాడనే అరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తండ్రి యోగ్రాజ్ సింగ్(Yograj Singh) మహీ భాయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కుమారుడి అంతర్జాతీయ కెరీర్‌ను జీవితాన్ని ధోనీ సర్వ నాశనం చేశాడని యోగ్రాజ్ ఆరోపించాడు.
‘నా కుమారుడు యువరాజ్ సింగ్ జీవితాన్ని ధోనీ నాశనం చేశాడు. తానే ఏం చేశాడనేది అద్ధంలో ముఖం చూసుకుంటే అతడికే అర్థమవుతుంది. నేను అయితే ధోనీని ఎప్పటికీ క్షమించను. అతడు గొప్ప అటగాడే. కానీ నా కొడుకు యూవీ కెరీన్‌ను దెబ్బతీశాడు. ఒకవేళ ధోనీ గనుక అడ్డు లేకుంటే నా బిడ్డ మరో నాలుగైదు ఏండ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడేవాడు’ అని యోగ్రాజ్ జీ స్విచ్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో అవేశంగా అన్నాడు.
యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ

టీమిండియా 2022లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడైన యూవీ.. ఆ తర్వాత జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఐసీసీ తొలిసారి ప్రవేశ పెట్టిన టీ20 వరల్డ్ కప్ విజయంలో యువరాజ్ పాత్ర మరువలేనిది. కీలక పోరులో ఇంగ్లండ్‌పై ఒకే ఓవర్లో ‘ఆరు’ సిక్సర్లతో గర్జించిన యూవీ.. ఆల్‌రౌండర్‌గానూ అదరగొట్టాడు. దాంతో ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు విశ్వ విజేతగా అవతరించింది.
రక్తం కక్కుతూనే..
ఆ తర్వాత 2011 వరల్డ్ కప్‌లోనూ యూవీ తన మార్క్ ఆటతో విజృంభించాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై రక్తం కక్కుతూనే అర్ధ సెంచరీతో జట్టును గెలిపించాడు. యువరాజ్ తన 17 ఏండ్ల(2000 నుంచి 2017) కెరీర్లో 402 మ్యాచ్‌ల ఆడాడు. 17 సెంచరీలు, 71 అర్ధ శతకాలతో రాణించాడు.
కాన్సర్‌ను జయించిన యోధుడు

టీమిండియా ఆల్‌రౌండర్‌గా యువరాజ్.. ఫినిషర్‌గా ధోనీలు ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడారు. మైదానంలో వీళ్లిద్దరూ గొడవపడిన సందర్భాలు అయితే కనిపించలేదు. అయితే.. 2011లో ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer) కారణంగా ఆటకు బ్రేక్ ఇచ్చిన యూవీ.. కీమోథెరపీ తర్వాత త్వరగా కోలుకున్నాడు. మళ్లీ బ్యాటు అందుకున్న యూవీ మునపటిలా చెలరేగిపోయాడు.
ఇవి కూడా చదవండి
- Chandrababu | రాజకీయాల్లో ఉన్న రౌడీలకు ఇదే నా వార్నింగ్.. గుడ్లవల్లేరు ఘటనపై చంద్రబాబు సీరియస్
- AP Rains | వరద బాధితులకు 25 కిలోల బియ్యం, నూనె, ఉల్లిగడ్డలు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
-
Rain effect | ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు.. హైదరాబాద్, విజయవాడ మధ్య రాకపోకలు బంద్..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

