Trains Cancelled | తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వాగులు వంకలు ఒప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల నేపథ్యంలో రైళ్ల రాకపోలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి, ఇంటికన్నె మధ్య రైల్వేట్రాక్ కింద మట్టి కోతకు గురైంది. పట్టాల కింద నుంచి భారీగా వరద ప్రవహిస్తున్నది. ఈ క్రమంలో ఆ మార్గంలో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు 40 రైళ్లు వరకు రద్దయ్యాయి. అదే సమయంలో పెద్ద ఎత్తున రైళ్లను అధికారులు దారి మళ్లించారు. సికింద్రాబాద్-విశాఖపట్నం (12728) గోదావరి ఎక్స్ప్రెస్ను కొండపల్లి రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. ప్రయాణికులను రాయన్పాడు నుంచి విజయవాడ స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక రైలులో విశాఖపట్నానికి ప్రయాణికులను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
రైలు నం. 12728, హైదరాబాద్ – విశాఖపట్నం
రైలు నం. 12727, విశాఖపట్నం – హైదరాబాద్
రైలు నం. 12738, లింగంపల్లి – కాకినాడపోర్ట్
రైలు నం. 12739, విశాఖపట్నం – సికింద్రాబాద్
రైలు నం. 12740, సికింద్రాబాద్ – విశాఖపట్నం
రైలు నం. 12745, సికింద్రాబాద్ – మణుగూరు
రైలు నం. 12746, మణుగూరు – సికింద్రాబాద
రైలు నం. 12749, మచిలీపట్నం – బీదర్
రైలు నం. 12750, బీదర్ – మచిలీపట్నం
రైలు నం. 12759, తాంబరం – హైదరాబాద్
రైలు నం. 12860, హైదరాబాద్ – తాంబరం
రైలు నం. 18519, విశాఖపట్నం – లోకమాన్య తిలక్
రైలు నం. 12861, విశాఖపట్నం – మహబూబ్నగర్
రైలు నం. 12775, కాకినాడపోర్ట్ – లింగంపల్లి
రైలు నం. 12776, లింగంపల్లి – కాకినాడపోర్ట్
రైలు నం. 07013, సికింద్రాబాద్ – బనరాస్
రైలు నం. 07014, బనారస్ – సికింద్రాబాద్
రైలు నం. 07632, నర్సాపూర్ – హైదరాబాద్
రైలు నం. 03242, బెంగళూరు – దానాపూర్
రైలు నం. 12737, కాకినాడపోర్ట్ – లింగంపల్లి
రైలు నం. 12707, గూడూరు – సికింద్రాబాద్
రైలు నం. 17033, భద్రాచలం – బల్లర్షా
రైలు నం. 17004, బల్లర్షా – కాజీపేట
రైలు నం. 17660, భద్రాచలం – సికింద్రాబాద్
రైలు నం. 17659, సికింద్రాబాద్ – భద్రాచలం
రైలు నం. 07753, కాజీపేట – డోర్నకల్
రైలు నం. 18046, హైదరాబాద్ – షాలిమార్
రైలు నం. 20707, సికింద్రాబాద్ – విశాఖపట్నం
రైలు నం. 20708, విశాఖపట్నం – సికింద్రాబాద్
రైలు నం. 12704, సికింద్రాబాద్ – హౌరా
రైలు నం. 12703, హౌరా – సికింద్రాబాద్
రైలు నం. 17230, సికింద్రాబాద్ – తిరువనంతపురం
రైలు నం. 17229, తిరువనంతపురం – సికింద్రాబాద్
రైలు నం. 12862, మహబూబ్నగర్ – విశాఖపట్నం
రైలు నం. 17058, లింగంలపల్లి – ఎస్టీఎం ముంబయి
రైలు నం. 17057, సీఎస్టీ – లింగంపల్లి
రైలు నం. 12762, కరీంనగర్ – తిరుపతి