SalmanKhan | 16 కిలోలు తగ్గిన సల్మాన్ ఖాన్.. అసలు కారణం ఇదే!
Salman Khan | బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సడన్‌గా 16 కిలోలు తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో అతడి ఆరోగ్యం బాలేదంటూ వార్తలు రావడంతో సల్మాన్‌కి ఏమైందంటూ పలువురు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Salman Khan | బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సడన్‌గా 16 కిలోలు తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో అతడి ఆరోగ్యం బాలేదంటూ వార్తలు రావడంతో సల్మాన్‌కి ఏమైందంటూ పలువురు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే తన ఫిట్నెస్ మరియు శరీర బరువులో వచ్చిన భారీ మార్పులపై వస్తున్న రకరకాల వార్తలకు ఎండ్ కార్డ్ పడేశారు సల్మాన్. ఇటీవల కాలంలో ఆయన పబ్లిక్ ఈవెంట్లలో చాలా సన్నగా కనిపించడంతో, ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో మరియు అభిమానుల మధ్య తీవ్రమైన చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రైమ్ వీడియో నిర్వహించిన ప్రత్యేక ‘అలయన్స్’ ఈవెంట్లో సల్మాన్ స్వయంగా తన ఆరోగ్య రహస్యాన్ని బయటపెట్టారు.
ఈ వేదికపై తన తమ్ముడు సోహైల్ ఖాన్‌తో కలిసి ముచ్చటించిన సల్మాన్ ఖాన్, తాను ఎలాంటి అనారోగ్యంతో బాధపడడం లేదని స్పష్టం చేశారు. తన రాబోయే చిత్రాల కోసం మరియు ప్రత్యేకమైన ఫిట్నెస్ లక్ష్యాలను సాధించడం కోసం ఉద్దేశపూర్వకంగానే బరువు తగ్గానని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన దాదాపు 16 కిలోల బరువును తగ్గించుకున్నట్లు తెలిపారు. కఠినమైన డైట్ ప్లాన్, క్రమశిక్షణతో కూడిన వ్యాయామాల వల్లే ఈ ట్రాన్స్ఫర్మేషన్ సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.
ఇదే కార్యక్రమంలో సోహైల్ ఖాన్ కూడా తన ఫిట్నెస్ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తను సైతం 12 కిలోలు తగ్గి, తన ఫిట్ బాడీతో ఆబ్స్ను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ, తన ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని, అభిమానులు ఎలాంటి అపోహలకు లేదా ఆందోళనలకు గురికావద్దని కోరారు. రాబోయే ప్రాజెక్ట్‌లలో సరికొత్త లుక్‌తో అలరించడానికి తాను సిద్ధమవుతున్నానని ఆయన ఈ సందర్భంగా చెప్పుకోచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కస్తాలలో సబ్ స్టేషన్ ముందు రైతుల నిరసన
విద్యుత్ వైరు తెగిపడి పాడి బర్రె మృతి
Crazy Kalyanam | ‘క్రేజీ కళ్యాణం’ రివ్యూ.. అనుపమ, తరుణ్ భాస్కర్ల సినిమా ఎలా ఉంది?
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, వడ్డీతో కలపి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

