వాషింగ్టన్: పశ్చిమాసియాలో తిష్టవేసిన సైన్యానికి.. అమెరికా సెంట్రల్ కమాండ్(US Central Command) కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న నేపథ్యంలో ఆ దేశంపై కొత్త తరహాలో, సంప్రదాయానికి భిన్నంగా విరుచుకుపడాలని సైన్యానికి అమెరికా మిలిటరీ ఆదేశాలు ఇచ్చింది. ఇరాన్‌పై వత్తిడి పెంచేందుకు కొత్త విధానాలు దాడులు చేయాల్సిన అవసరం ఉందని సైన్యానికి సెంట్రల్ కమాండ్ ఈమెయిల్ చేసింది. సెంట్రల్ కమాండ్‌కు చెందిన ఇంటెలిజెన్స్ శాఖ ఆధునాతన పద్ధతుల్లో ఇరాన్‌పై వత్తిడి పెంచాలని భావిస్తున్నది. ఇరాన్‌తో వార్ నేపథ్యంలో యుద్ధ వ్యూహాన్ని సమీక్షించాలని సెంట్కామ్ ఆలోచిస్తున్నది. అయితే భిన్నంగా ఆలోచించి, ఇన్నోవేటివ్ పద్ధతిలో ముందకు కదిలే చరిత్ర అమెరికా సెంట్రల్ కమాండ్‌కు ఉన్నట్లు సెంట్కామ్ ప్రతినిధి కెప్టెన్ తిమోతీ హాకిన్స్ తెలిపారు. ఆపరేషనల్ పర్ఫార్మెన్స్లో ఉత్తమంగా రాణించేందుకు సైనికులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు అడ్మిరల్ కూపర్ తెలిపారు. ఇరాన్‌పై తాజా దాడికి ప్రిపేరైనట్లు ట్రంప్ ప్రకటన చేయడానికి ముందే సైనికులకు ఈమెయిల్స్ వెళ్లినట్లు తెలిసింది. అయితే సౌదీ అరేబియా చక్రవర్తి మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ జోక్యం చేసుకోవడంతో ఇరాన్‌పై దాడిని అమెరికా వాయిదా వేసినట్లు తెలిసింది.