INDW vs SLW : వరల్డ్ ఛాంపియన్ భారత జట్టు స్వదేశంలో తొలి సిరీస్ పట్టేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ(79 నాటౌట్) విధ్వంసక అర్ధ శతకంతో చెలరేగగా.. మూడో టీ20లోనూ భారీ విజయంతో సిరీస్ పట్టేసింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టుకు కనీస పోటీ ఇవ్వలేకపోతున్న లంక త్రివేండ్రంలోనూ చతికిలపడింది. రేణుకా సింగ్(4-21)తో నిప్పులు చెరగగా.. స్వల్ప ఛేదనలో షఫాలీ ఉప్పెనలా విరుచుకుపడింది. అంతే.. 13.2 ఓవర్లలోనే విక్టరీ కొట్టిన భారత్.. మరో రెండు మ్యాచ్‌లుండగానే సిరీస్ పట్టేసింది.
స్వదేశంలో ఇటీవలే వన్డే ప్రపంచకప్‌తో చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ బృందం.. పొట్టి సిరీస్‌ను కైవసం చేసుకుంది. త్రివేండ్రంలో శుక్రవారం శ్రీలంకను 112కే కట్టడి చేసిన టీమిండియా.. స్వల్ప లక్ష్యాన్ని ఉఫ్‌మనిపించింది. ఓపెనర్ షఫాలీ వర్మ(79 నాటౌట్) సుడిగాలిలా చెలరేగి బౌండరీల మోతతో లక్ష్యాన్ని మంచులా కరిగించింది. స్మృతి మంధాన(1), జెమీమా రోడ్రిగ్స్(9)లు విఫలమైనా.. దూకుడే మంత్రగా ఆడిన లేడీ సెహ్వాగ్ 24 బంతుల్లోనే సెంచరీ కొట్టింది.
A win by 8⃣ wickets ✅
Series sealed ✅#TeamIndia with yet another complete show 🍿Scorecard ▶️ https://t.co/Vkn1t7b6Dm#INDvSL | @IDFCFIRSTBank️ pic.twitter.com/3Tg10Qa5WJ
— BCCI Women (@BCCIWomen) December 26, 2025
హఫ్ సెంచరీ తర్వాత కూడా అదే దూకుడు కనబరిచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(21 నాటౌట్)తో కలిసి జట్టుకు భారీ విజయాన్ని అందించింది. ఈ గెలుపుతో టీ20ల్లో అత్యధిక విజయాలతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మేగ్ లానింగ్ పేరిట ఉన్న రికార్డును హర్మన్‌ప్రీత్ బ్రేక్ చేసింది. 77 విజయాలతో లానింగ్‌ను ఇండియన్ స్కిప్పర్ వెనక్కి నెట్టేసింది.
4⃣, 6⃣, 4⃣
Shafali Verma taking full advantage of the powerplay 🔥#TeamIndia 60/1 after 7 overs.
Updates ▶️ https://t.co/Vkn1t7b6Dm#INDvSL | @TheShafaliVerma | @IDFCFIRSTBank️ pic.twitter.com/pDkEZlQ7GF
— BCCI Women (@BCCIWomen) December 26, 2025
వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన శ్రీలంక చావోరేవో పోరులోనూ చిన్న స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడిన ఆ జట్టు ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ఆరంభించింది. ఓపెనర్ హాసిని పెరీరా( హాసిని పెరీరా(25) బౌండరీలతో చెలేరగడంతో స్కోర్ దాటింది. అయితే.. దీప్తి శర్మ(3-18) ఓవర్లో చమరి ఆటపట్టు(3)ను ఔట్ చేసి దీప్తి శర్మ తొలి బ్రేకిచ్చింది. ఆ తర్వాత ఆరో ఓవర్లో రేణుకా సింగ్(4-21) పెరారీతో పాటు డేంజరస్ హర్షిత సమరవిక్రమ(2)లను వెనక్కి పంపింది. దాంతో.. 32కే లంక మూడు బిగ్ వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో కూరుకుపోయింది.
కీలక బ్యాటర్లు ఔట్ కావడంతో కష్టాల్లో పడిన లంకను ఇమేశా దులానీ (27) ఆదుకుంది. అయితే.. ఆమెతో కలిసి భాగస్వామ్యంతో జట్టును ఆదుకోవాలనుకున్న నీలాక్షి డిసిల్వా(4)ని రేణుక ఎల్బీగా పెవిలియన్ చేర్చింది. దాంతో.. 10 ఓవర్లకు లంక స్కోర్. 45-4. క్రాంతి గౌడ్, దీప్తి ఓవర్లో ఫ్రంట్‌ఫుట్‌లో… స్వీప్ షాట్లతో విరుచుకుపడిన దులానీ.. కవిశ దిల్మరి(20) తో కలిసి స్కోర్ బోర్డును ఉరికించింది. 26 బంతుల్లో 40 రన్స్ పిండుకున్న ఈ ద్వయ్నా దీప్తి విడదీసింది. సిక్సర్‌కు యత్నించిన దిల్హరి బౌండరీ వద్ద అమన్‌జోత్ చేతికి చిక్కడంతో 85 వద్ద ఐదో వికెట్ పడింది. కాసేపటికే దులానీని రేణుక వెనక్కి పంపగా లంక స్కోర్ నెమ్మదించింది. ఆఖర్లో కుశాని నుత్యంగన(19 నాటౌట్) మెరుపులతో ఆటపట్టు బృందం నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 112 రన్స్ చేయగలిగింది.
𝗜.𝗖.𝗬.𝗠.𝗜
Renuka Singh Thakur was on fire tonight 🔥
She finished with brilliant figures of 4⃣/2⃣1⃣ 👏
Updates ▶️ https://t.co/Vkn1t7b6Dm#TeamIndia | #INDvSL | @IDFCFIRSTBank pic.twitter.com/Pblm6kII4j
— BCCI Women (@BCCIWomen) December 26, 2025