BRS : పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జోరందుకున్న బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ షాకిస్తూ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. ఎర్రవల్లిలోని నివాసంలో శుక్రవారం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో 150 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారిని కేటీఆర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.