MLA Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎల్లప్పుడూ బీజేజీ సైనికుడినేనని చెప్పిన ఆయన.. పార్టీ పెద్దలు కోరితే తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. కమలం పార్టీ తనకు కుటుంబంతో సమానమని పేర్కొన్న రాజా సింగ్.. తన రీ-ఎంట్రీ గురించి ఆసక్తికరమైన ఉదాహరణ పంచుకున్నారు.
ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉండి, ఒక అన్నయ్య గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోతే.. వెంటనే లేదంటే కాస్త ఆలస్యంగానైనా ఆ సోదరుడు ఇంటికి తిరిగి రావాల్సి ఉంటుంది. నేను కూడా అంతే. ఈరోజు కాకపోతే, రేపు నా ఇంటికి తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. ఆ శుభ సమయం ఎప్పుడు వస్తుందో ఇప్పుడే నేను మీకు చెప్పలేను. నేను భారతీయ జనతా పార్టీకి నిజమైన సైనికుడిని. ఢిల్లీ లేదా రాష్ట్ర ఉన్నతాధికారులు నన్ను పిలిచిన రోజు, నేను నా పార్టీలోకి తిరిగి వస్తాను.
నేను ఎప్పటికీ బీజేపీ సైనికుడినే
పార్టీ ఎప్పుడు పిలిచినా చేరేందుకు సిద్ధం – ఎమ్మెల్యే రాజాసింగ్ https://t.co/WJWHH72cLp pic.twitter.com/w0IZ3M12bh
— Telugu Scribe (@TeluguScribe) December 26, 2025
ఇంతకు ముందు కూడా నేను కమలాధిపతులకు ఇదే అభ్యర్థన చేశాను. ఈ రోజు కూడా అదే అభ్యర్థన చేస్తున్నాను. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ కల్పించాలి. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీకి వారి నియోజకవర్గంలో స్వేచ్ఛ ఇవ్వాలి. అప్పుడే మన పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రాగలదు. ఈరోజు కాకపోయినా రేపైనా నాకు ఢిల్లీలోని పెద్ద నాయకుల నుండి లేదా రాష్ట్రంలోని పెద్ద నాయకుల నుండి పిలుపు వస్తుందని ఖచ్చితంగా తెలుసు. ఇవ్వాళ లేకపోతే రేపు మా పెద్దోళ్ళ నుంచి నాకు ఫోన్ వస్తే ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తాను. మాకు స్వేచ్ఛ ఇవ్వండి అని వారిని కోరుతాను అని రాజాసింగ్ వెల్లడించారు.