Holidays | రాజన్న సిరిసిల్ల : కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన సందర్భంగా.. ప్రయివేటు బడులకు బలవంతంగా సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆయా ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు అధికారికంగా పిల్లల తల్లిదండ్రులకు మేసేజ్‌లు పంపారు.
ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన సందర్భంగా.. మా పాఠశాల వాహనాలను సభకు పంపిస్తున్నాం. ఈ కారణంగా విద్యార్థులకు సెలవులు ప్రకటిస్తున్నాం. డిసెంబర్ 14న రెండో శనివారం రోజున సెలవు ఉండదని, ఆ రోజు పాఠశాలలు పని చేస్తాయని యాజమాన్యాలు పేర్కొన్నాయి. రాజన్న సిరిసిల్ల డీఈవో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి వస్తే స్కూళ్ళు మూయడమేంటి..? అని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ చేసే నిర్వాకానికి విద్యార్థులు బలవ్వాలా..? అంటూ కాంగ్రెస్ నియతృత్వ పాలన, వికృత చర్యలపై మండిపడుతున్నారు. అర్ధం పర్ధం లేని కాంగ్రెస్ చేష్టలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక నిన్న హనుమకొండలో కాంగ్రెస్ సభ జరిగిన విషయం తెలిసిందే. ఈ సభ నేపథ్యంలో హనుమకొండలోని ప్రయివేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గతంలో వరంగల్‌కు మోదీ, కేసీఆర్ వెళ్లినప్పుడు కూడా ఏ ఒక్క పాఠశాలకు కూడా సెలవు ప్రకటించలేదు. కానీ రేవంత్ మాత్రం తన సభలకు ప్రయివేటు స్కూళ్ల బస్సులను వాడుకోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. కుల గణన కోసం ఒంటి పూట బడులు నిర్వహిస్తున్న రేవంత్ ప్రభుత్వంపై పలువురు నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.
సిరిసిల్లకు సీఎం రాకడ.. సర్కార్ వింత పోకడ..
ప్రైవేట్ బడులు బంద్ పెట్టిచ్చి సభకు బస్సులు పెట్టిస్తున్న కాంగ్రెస్ సర్కార్
డిసెంబర్ రెండవ శనివారం రోజు వర్కింగ్ డే గా స్కూల్ నడిపించమని DEO ఉత్తర్వులు
ముఖ్యమంత్రి వస్తే స్కూళ్ళు మూయడమేంటి..?
సభకు, చదువులకు లింకేంటి..?
కాంగ్రెస్ చేసే… pic.twitter.com/Q3UFeB7GcP— BRS Party Sircilla (@BrsSircilla) November 19, 2024
ఇవి కూడా చదవండి..
TG-TET-2024-II | నేటి సాయంత్రంతో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు
Harish Rao | 11 నెలల కాలంలో 42 మంది విద్యార్థులు మృతి.. రేవంత్ సర్కార్‌పై మండిపడ్డ హరీశ్‌రావు
Vemulavada | వేములవాడకు సీఎం రాక.. భక్తులకు రాజన్న దర్శనాలు నిలిపివేత