TG-TET-2024-II | హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల గడువు బుధవారం సాయంత్రంతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు ఈ రోజు సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు టెట్‌కు 2.07 లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయి. అయితే టెట్ దరఖాస్తుల గడువును రెండు, మూడు రోజులు పొడగించాలని బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి కోరారు.
డిసెంబర్ 26 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనవరి 1వ తేదీ నుంచి 20 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి రోజు రెండు సెషన్లలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఉదయం సెషన్ 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నాం సెషన్ 2 గంటల నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.