హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వైరస్ విజృంభణకు చాలా మంది చిన్నారులు తమ తల్లిదండ్రులను, సంరక్షకులను కోల్పోతున్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అలాంటి పిల్లల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ డెస్కు ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన పిల్లలను చైల్డ్ కేర్ సెంటర్లు, అనాథ గృహాల్లో ఉంచుతామని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తెలిపింది. ఈ మేరకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ – 1098. ఇతర వివరాల కోసం 040-23733665 నంబర్‌ను ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించొచ్చు.
This pandemic has been very harsh especially on children. Some lost both their parents or some are taking care of Covid positive parent. Telangana Government’s Children Helpdesk has issued their numbers. Let’s ensure this reaches to the ones in need.#TelanganaFightsCorona pic.twitter.com/XvhmCzM6wL
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 1, 2021
ఇవికూడా చదవండి..