e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home తెలంగాణ తప్పు ఒప్పుకొన్న ఈటల

తప్పు ఒప్పుకొన్న ఈటల

తప్పు ఒప్పుకొన్న ఈటల
  • వివర్ణమైన ముఖంతో విలేకరుల సమావేశానికి..
  • నీళ్లు తాగి.. నీళ్లు నమిలి..
  • ప్రభుత్వం తీసుకుంటే ఒప్పు..నేను చేస్తే తప్పా: మంత్రి
  • ఏ విచారణకైనా సిద్ధమంటూ రొటీన్‌ పొలిటికల్‌ డైలాగు
  • అసైన్డ్‌ భూమి స్వాధీన యత్నంపై ఒప్పుకోలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (నమస్తే తెలంగాణ): ‘ప్రభుత్వం వందల ఎకరాల భూసేకరణ చేస్తలేదా?. ఆ చేస్తున్నవన్నీ అసైన్డ్‌ భూములే కదా. ప్రభుత్వం తీసుకోవచ్చు కాని, నేను తీసుకుంటే తప్పా?’ ఇదీ మంత్రి ఈటల రాజేందర్‌ శుక్రవారం మీడియా సమావేశంలో చేసిన వితండ వాదన. బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టినట్టు చెప్పిన ఈ ఒక్క మాటతోనే ఆయన తప్పిదాన్ని తానే బయటపెట్టుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. మీడియాసమావేశానికి కాంతివిహీనమైన ముఖంతో వచ్చిన ఈటల.. తడబడుతూనే మాట్లాడారు. మధ్యమధ్యలో మంచినీళ్లు తాగారు. తాను చేసింది తప్పేమీ కాదని, పైగా ప్రజలకు వెసులుబాటు కల్పించానని చెప్పుకొచ్చారు. ఈటల భూకబ్జాపై మాసాయిపేట మండలం అచ్చపేట, హకీంపేట గ్రామాల బడుగు, బలహీన వర్గాల రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసిన నేపథ్యంలో ఆయన శామీర్‌పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

‘రింగ్‌రోడ్ల పేరిట, పరిశ్రమల పేరిట, ఫార్మా సిటీలు అంటూ ఎవరు భూములు సేకరిస్తున్నారు? ప్రజలు తమ భూమి పనికొస్తలేదు.. సాయం చేయమంటేనే నేను తీసుకొని వెసులుబాటు కల్పించాను’ అని వ్యాఖ్యానించారు. ప్రజాప్రయోజనం కోసం ప్రభుత్వం ఎవరి భూమినైనా తీసుకోవచ్చని చట్టం చెప్తున్నదంటూనే, ఒక కంపెనీ నడిపే ఈటల రాజేందర్‌ తాను ప్రభుత్వం కాదనే విషయాన్ని మరచిపోవడం విశేషం. అసైన్డ్‌ భూముల కబ్జా సంగతిని వదిలేసి.. అక్కర్లేని కథనంతా వినిపించారు. అసలు విషయం కొసరంత మాట్లాడి తన చరిత్రను డబ్బాకొట్టి తప్పించుకున్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే లేచి వెళ్లిపోయారు. మొదటి నుంచి ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు శత విధాలా ప్రయత్నించిన మంత్రి ఈటల, ఈ క్రమంలో అసైన్డ్‌ భూములను తాను కొనుగోలుచేసిన మాట వాస్తవమేనని పరోక్షంగా అంగీకరించడం గమనార్హం.

తాను మంత్రిగా మొదట అధికారిక ప్రక్రియ ద్వారా భూములు తీసుకోవాలని ప్రయత్నం చేసినట్టు, అది సాధ్యం కాకపోవడంతో వాటిని సరెండర్‌ చేయించి తనతోపాటు తన వారి పేరు మీద పట్టా చేయించుకున్నట్టు పరోక్షంగా అంగీకరించారు. ఒక వ్యక్తికి, ఒక కంపెనీకి లబ్ధి కోసం పేద ప్రజలే తన వద్దకు వచ్చి భూములు కొనుగోలు చేయాలని కోరినట్టు చెప్పుకొచ్చారు. ఒకవైపు పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించాను అని చెప్తూనే.. తనకు ఆస్తులు లెక్క కాదంటూ వ్యాఖ్యానించారు. రాజీనామా చేస్తారా అని అడిగిన ప్రశ్నకు తనకు పదవులు లెక్క కాదంటూనే ‘ముందు ఈ సంగతి తేలాలి’ అంటూ దాటవేశారు.

వాళ్లే భూములిచ్చారు..
రాష్ట్రంలో నేడు అమ్మకానికి గుంట భూమి దొరకడం లేదు. భూమి మీదనే ఆధారపడిన వారైతే అసలు వదులుకొనేందుకు ఏమాత్రం సిద్ధగా లేరు. తాను కొనుగోలుచేసిన భూములను మాత్రం వారు ఇష్టంగా ముందుకొచ్చి ఇచ్చారని, తమను ఆదుకోవాలని కోరారని ఈటల తెలిపారు. ఒకవైపు తమ భూములు బలవంతంగా సంతకాలు పెట్టించి లాక్కున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూంటే మంత్రి మాత్రం వారివి తప్పుడు మాటలని చిత్రీకరించే యత్నం చేశారు. వాళ్లే సరెండర్‌ చేశారని చెప్పి అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్రంలో ఎంతోమంది ఎన్నో కోట్లు సంపాదిస్తున్నారని వారందరిని కూడా ప్రశ్నించాలని ఈ సందర్భంగా మాట్లాడారు. ఇక తన బాగోతాన్ని ప్రసారం చేసిన చానళ్లకు కూడా ఈటల తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు పాతరేస్తరని శాపాలు పెట్టారు.

విలేకరులు అడిగిన ఈ ప్రశ్నలకు జవాబుల్లేవు..

  1. అసైన్డ్‌ భూములను అధికారిక ప్రక్రియ ద్వారా టీఎస్‌ఐఐసీకి బదలాయింపజేసి, మీరు అలాట్‌ చేయించుకుందామని అనుకున్నట్లు మీరు చెప్తున్నారు. కానీ, ఆ ప్రక్రియ అంతా జరగకముందే మీరు ఆ భూమికి కాంపౌండ్‌ వాల్‌ ఎందుకు కట్టారు?
  2. అధికారికంగా కేటాయింపు జరగకముందే ఆ భూమిని ఎందుకు మీ స్వాధీనంలోకి తీసుకున్నారు.?
  3. పేదోళ్ల భూములను ఎందుకు సరెండర్‌ చేయిస్తున్నారు?
  4. మీకిప్పటికే చాలా భూములున్నాయని మీరే చెప్తున్నారు కదా. ఒక మంత్రిగా, బడుగు బలహీనవర్గాల వారికి, వారి భూములు సాగుచేసే అవకాశం ఇవ్వాల్సింది పోయి, వారి భూములను మీరు ఎలా తీసుకుంటారు?

ఇవీ కూడా చదవండి…

కరోనా వచ్చి పోతే ఒక్క డోస్‌ టీకా చాలు!

డోన్ల ద్వారా వ్యాక్సిన్‌ పంపిణీ

ఈటల ‘అక్రమ’మేనా?!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తప్పు ఒప్పుకొన్న ఈటల

ట్రెండింగ్‌

Advertisement