Traffic | హైదరాబాద్ : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న వారితో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. 10 టోల్‌బూత్‌ల ద్వారా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్న వాహనాలను టోల్ ప్లాజా సిబ్బంది పంపిస్తున్నారు. హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను ఆరు గేట్ల ద్వారా పంపిస్తున్నారు. చౌటుప్పల్ కూడలిలో అండర్‌పాస్ నిర్మాణ పనుల వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
గుంటూరు, నెల్లూరు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తున్నారు. హైదరాబాద్ – నాగార్జున సాగర్ హైవే మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. ఓఆర్ఆర్ పైకి వెళ్లి బొంగులూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకుంటే మంచిదని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తున్నారు. భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. భువనగిరి వైపు వెళ్లేందుకు ఓఆర్ఆర్ పైకి వెళ్లి ఘట్కేసర్ వద్ద ఎగ్జిట్ కావాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ వైపు వెళ్లే వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తున్నారు. నార్కట్‌పల్లి దాటితే ట్రాఫిక్ తిప్పలు తప్పనుంది.
ఇవి కూడా చదవండి..
TG Highcourt | రైతుల హక్కులను కాలరాయొద్దు.. శాంతియుత ఆందోళనలో పోలీసుల ప్రమేయం ఎందుకు?
Khammam | ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో.. ఒకేరోజు 50 వేల గజాలు రిజిస్ట్రేషన్
Danam Nagender | హైదరాబాద్ ఇమేజ్ పెంచిన ఫార్ములా రేస్.. ఇందుకు కేటీఆర్ చేసిన కృషిని మరువలేం