Harish Rao | ఖమ్మం : ఖమ్మం జిల్లాలో వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
గత మూడు నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో తీవ్రమైన నష్టం జరిగింది. సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాల వల్ల జనజీనవం అతలాకులతమైంది. భారీగా ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరిగింది. వరదల విషయంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం వల్ల, ప్రజలను అలర్ట్ చేయకపోవడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరిగిందన్నారు హరీశ్‌రావు.
పార్టీ తరపున వరద బాధితులకు సహాయం అందించేందుకు సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్, జగదీశ్ రెడ్డి, రవిచంద్ర, నామా నాగేశ్వర్ రావు, వివేకానంద గౌడ్, కౌశిక్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, శంభీపూర్ రాజు వచ్చాం. ప్రభుత్వం చేపడుతున్న వరద చర్యలు పరిశీలించేందుకు వచ్చాం. పాలేరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి సహాయం అందించారు. పువ్వాడ అజయ్ ఖమ్మంలో ఆయా డివిజన్ల ప్రజలకు నిత్యావసరాలు అందిస్తున్నారు. ఖమ్మం ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని ముందుకు వచ్చాం. వార్డుల్లో ప్రజలను కలుస్తుంటే పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. కళ్లళ్లో నీళ్లు పెట్టుకుంటున్నారు. పసి పిల్లలకు పాలు దొరకక బాధపడుతున్నారు. తాగడానికి మంచినీళ్లు లేవు.. నిత్యావసరాలు అందించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని తమ ఆవేదన వ్యక్తం చేశారని హరీశ్‌రావు తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముందుస్తుగా మైక్‌లో అనౌన్స్ చేసి అలర్ట్‌గా బయటకు తీసుకెళ్లారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి సహకారం అందిందింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలను అలర్ట్ చేయలేకపోయారు. వారి ప్రాణాలను కూడా కాపాడుకోలేకపోయింది. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపించినా కూడా 9 మందిని కాపాడాలేకపోయారు. కనీసం హెలికాప్టర్‌ను కూడా పంపలేకపోయారు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
Khammam Floods | ఖమ్మంలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాల దాడులు
Harish Rao | ఖమ్మం వరద బాధితుల బాధలు విని.. తీవ్ర భావోద్వేగానికి లోనైన హరీశ్‌రావు