Harish Rao | ఖమ్మం : ఖమ్మం వరద ప్రాంతాల్లో బాధితులు తమ బాధలు చెప్పుకుంటుంటే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కరుణగిరి రాజీవ్ గృహకల్ప, వెంకటేశ్వర నగర్, కాలువొడ్డు, బొక్కల గడ్డ ప్రాంతాల్లో బురదలో కాలి నడకన పర్యటిస్తూ ప్రజల కష్టాలను హరీశ్‌రావు తెలుసుకున్నారు.
కడుపుకు ఇంత తిండి పెట్టేవాళ్లే ఈ ప్రభుత్వంలో లేరా అని.. ప్రభుత్వం పట్టించుకోలేదని, సహాయం చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు కేవలం ప్రచారం కోసం వచ్చిపోతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు కానీ.. కనీసం కారు కూడా దిగకుండా చేతులు ఊపుతూ వెళ్లారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరదల్లో సర్వం కోల్పోయామని, కట్టుబట్టలతో రోడ్డు మీద నిలుచున్నామని, తినడానికి తిండి తాగడానికి నీరు కూడా లేవని.. బురదలో ఉండడానికి నీడ లేక చిన్నపిల్లలతో నరకయాతన అనుభవిస్తున్నామని బాధితులు చెబుతుంటే హరీశ్‌రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వరద ధాటికి ఇళ్లల్లోకి నీరు చేరుకోవడంతో సర్టిఫికెట్లు అన్ని తడిసిపోయాయని పలువురు పిల్లలు హరీశ్‌రావు దృష్టికి తీసుకొచ్చారు.
ఖమ్మం వరద ప్రాంతాల్లో బాధితులు తమ బాధలు చెప్పుకుంటుంటే తీవ్ర భావోద్వేగానికి లోనైన హరీష్ రావు.
కరుణగిరి రాజీవ్ గృహకల్ప, వెంకటేశ్వర నగర్, కాలువొడ్డు, బొక్కల గడ్డ ప్రాంతాల్లో బురదలో కాలి నడకన పర్యటిస్తూ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న హరీష్ రావు.
కడుపుకు ఇంత తిండి పెట్టేవాళ్లే ఈ… https://t.co/TXlN72wvhr pic.twitter.com/jMsYPYV2KC
— Telugu Scribe (@TeluguScribe) September 3, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి హరీశ్‌రావు.. వీడియో