CM Revanth Reddy | ఖమ్మం : వానలు, వరదలు, మున్నేరు బీభత్సంతో ఖమ్మం జిల్లా కేంద్రం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. పలు కాలనీలు నీట మునిగాయి. నిత్యావసరాలన్నీ తడిసి ముద్దయ్యాయి. తినేందుకు తిండిలేక, కనీసం దాహార్తి తీర్చుకునేందుకు తాగేనీరు కూడా లేకపోవడంతో స్థానికులు విలవిలలాడిపోయారు. కాలనీల్లో కుప్పలుతెప్పలుగా బురద పేరుకుపోవడంతో.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అయితే ఇవాళ ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు నాయకులు పర్యటించారు. వరద బాధితులను పరామర్శించి, వారికి నిత్యవసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తమను ఆదుకోవాలంటూ వరద బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక నిన్న పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డిపై ఓ వరద బాధితురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె కోపం కట్టలు తెంచుకుంది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు కానీ కనీసం కారు కూడా దిగకుండా వెళ్లిపోయారు. వరద ముంపునకు గురైన ఇండ్లను పరిశీలించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం కాని, అధికారులు కాని ఏం చేశారు చెప్పండి.. తినడానికి రైస్ కూడా లేదు మాకు. నిన్న పువ్వాడ అజయ్ వచ్చి నీళ్ళు ఇచ్చి వెళ్ళారు. ఇది నా ఒక్క పరిస్థితే కాదు.. ఈ కాలనీల్లో ఉన్న అందరి పరిస్థితి ఇదే. ఇంతకంటే దారుణ పరిస్థితులు ఉన్నాయని ఆమె వాపోయారు.
ఇవి కూడా చదవండి..
Medigadda barrage | మేడిగడ్డ బ్యారేజీకి భారీ వరద.. 85 గేట్లు ఎత్తి నీటి విడుదల
Harish Rao | ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి హరీశ్‌రావు.. వీడియో